Black money centarl govt sit mb sha

black money, sit, mb sha, arun jaitly, swiss, black money in swiss banks, swiss bank, indians money in swiss banks

black money, centarl govt. sit mb sha : central govt. moves on black money, 60 of 627 in the list of swiss accouts have to procecute.

నల్లడబ్బును తవ్వేద్దాం....దేశానికి తరలిద్దాం!

Posted: 02/09/2015 12:36 PM IST
Black money centarl govt sit mb sha

బ్లాక్ మని..దేశ ప్రజలు అందరు అనుభవించాల్సిన ధనాన్ని తమ కోసం విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న డబ్బు. భారతదేశం ఏర్పడిన తరువాతి నుండి ఎన్నో ప్రభుత్వాలు నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని హామీ ఇవ్వడం తరువాత దాన్ని మరిచిపోవడం భారత్లో ఓ ఆనవాయితిగా మారింది. విదేశాల్లో ఉన్న నల్లడబ్బుతో దేశంలో ఒక బడ్జెట్ ను కూడా నడుపవచ్చు అని కొందరి భావన. అంత డబ్బు విదేశాల్లో ఉంటే భారత్ ఎలా ముందుకు సాగుతుందని చాలా మంది ప్రశ్న. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా తమ నల్లధనాన్ని దాచి పెట్టుకోవడానికి అన్ని రకాలుగా యోగ్యమైందిగా స్విస్ బ్యాంకులను నమ్ముతారు భారతీయులు. అందుకే స్విస్ బ్యాంకుల్లో వేల కోట్ల విదేశీ ధనం మూలుగుతోందని దాన్ని వెనక్కి తీసుకురావడానికి అన్ని ప్రభుత్వాలు నామమాత్రంగా కృషి చేశాయి.

స్వతంత్ర తరువాత అధికారంలోకి వచ్చిన నెహ్రూ ప్రభుత్వం హయాం నుండి భారత్ నుండి కోట్ల రూపాయల డబ్బు యద్దేచ్చగా దేశం దాటి వెళుతోంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా మంది రాజకీయ నాయకులు , వారి బంధు గణం అక్రమంగా సంపాదించిన డబ్బును గుట్టుచప్పుడు కాకుండా దేశ సరిహద్దులు దాటించిందని విమర్శ. రాజీవ్ గాంధీ కాలంలొ జరిగిన చాలా కుంభకోణాల్లో సంపాదించిందంతా విదేశాల్లో మూలుగుతోందని బీజేపీ నాయకులు చాలా సార్లు విమర్శించారు. అదే పరంపరను కొనసాగిస్తు చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ డబ్బును ఇలా విదేశాలకు తరలిస్తున్నారు. వందల నుండి వేల కోట్లు, లక్ష కోట్లు ఇలా ఇంతకింతకు వటవృక్షంలా పాతుకుపోతోంది. ఇంత డబ్బును అక్రమంగా తరలించడంలో మన దేశంలోని ప్రభుత్వాలు తమ చిత్తశుద్దిని నిరూపించుకున్నాయి. డబ్బును అక్రమంగా దేశం దాటించే బాధ్యతను అధికారులు, రాజకీయ నాయకులు తమ భుజస్కందాలపై వేసుకొని, చిత్తశుద్దితో పని చేస్తున్న విషయాన్ని ఎవరూ శంకించరు. స్వాతంత్రం సిద్దించినప్పటి నుండి భారత్ అభివృద్ది చెందుతున్న దేశంగా మిగిలిపోవడానికి నల్లడబ్బు ఓ ప్రధాన కారణం.

కాగా బ్లాక్ మనీ మీద మరో వాదన కూడా ఉంది. విదేశాల్లో ఉన్నదంతా నల్లడబ్బు కాదు, అలాగే మొత్తం డబ్బును దేశం కోసం వాడుకోవడానికి వీలుపడదు అనేది మరో వాదన. విశ్లేషకుల వాదన ప్రకారం విదేశాల్లో దాచిన చాలా వరకు ధనం అక్రమంగా సంపాదించింది కాకపోవచ్చు. కానీ వాటికి కట్టాల్సిన పన్ను, చూపించాల్సిన లెక్కలు సరిగ్గా లేకపోవచ్చు. కానీ అంత మాత్రాన అంత డబ్బును ప్రభుత్వం తన స్వంత ఖర్చులకు వినియోగించడానికి వీలుపడదు. బడా పారిశ్రామికవేత్తలు తమ ఆదాయానికి తగిన పన్నును చెల్లించరు. దాంతో ఆ డబ్బను విదేశాల్లో దాచుకోవడానికి లేదా  విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. ఇది చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హవాలా ద్వారా చేరుతున్న డబ్బులు మాత్రం చాలా వరకు అక్రమ సంపాదనే అని వారంటున్నారు. అవినీతి మరకలతో గద్దెదిగిన కాంగ్రెస్ నుండి రాష్ట్రాల్లో చిన్నాచితకా పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు స్విస్ అకౌంట్లతో తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. విదేశాల్లో డబ్బు తిరిగి మన దేశానికి చేరిన విదేశీ మారకం విలువ పెరిగి దేశీయ రూపీ విలువ పెరగుతుంది. ఫలితంగా డాలర్ ముందు మన రూపాయి నిలబడుతుంది. దాంతో విదేశాలకు వెళ్లే చాలా మంది మేధావులు మేధో వలసలు ఆగిపోతాయి. అంతకంతకు పెరిగిన ఈ నల్లధన జబ్బుకు వైద్యం చెయ్యకపోతే దేశం ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉంటుంది.

సాధారణ ఎన్నికల్లో బీజేపీ హామీల్లో ప్రధానమైంది నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం. విదేశాల్లోని భారతీయుల మొత్తం డబ్బులను నయాపైసాతో సహా దేశానికి రప్పిస్తామిన బీజేపీ గట్టి హామీ ఇచ్చింది. అందులో భాగంగానే గత కొద్దిరోజుల క్రితం కేంద్రం నల్లధనంపై సిట్ ను వెయ్యడం జరిగింది. దానికి ఎమ్.బి షా నేతృత్వం వహిస్తున్నారు. స్విస్లో ఖాతా కలిగిన 627 మంది పేర్లను ఈ కమిటి సుప్రీం కోర్టుకు సమర్పించింది. తాజాగా 60 మందిపై  దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటి వరకు 350 మంది ఖాతాల వివరాలను సేకరించామని మిగిలిన వాటిని మార్చి 31లోగా పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ప్రకటించారు.60 మంది ఖాతాదారులపై అభియోగాలు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఆయన తెలిపారు. స్విస్ అధికారులతో మాట్లాడడానికి అక్టోబర్లో కేంద్రం బృందాన్ని పంపినట్లు చెప్పారు.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black money  sit  mb sha  arun jaitly  swiss  

Other Articles