Two indians win honours at grammy awards

Two Indians win grammy awards, Ricky Kej won grammy awards, Neela Vaswani won grammy awards, 57th edition of the musical extravaganza

Two Indians -- Ricky Kej and Neela Vaswani -- took home a Grammy Award each at the 57th edition of the musical extravaganza

ఇద్దరు భారతీయులకు గ్రామీ అవార్డుల ప్రధానం

Posted: 02/10/2015 08:04 AM IST
Two indians win honours at grammy awards

సంగీత ప్రపంచంలో అత్యద్భుత స్వరాలాపణలు సృష్టించిన ఇద్దరు భారతీయ సంగీత దర్శకులకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డులు అందాయి. 57వ ‘గ్రామీ’ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. బెంగళూరుకు చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ తన ‘విండ్స్ ఆఫ్ సంసారా’ ఆల్బమ్‌కు ఈ అవార్డు గెలుచుకున్నాడు.

అదే విధంగా నీలా వాస్వాని.. మలాలా యూసఫ్ జాయ్‌పై తీసిన డాక్యుమెంటరీ‘ఐ యామ్ మలాలా: హౌ వన్ గర్ల్ స్టూడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ చెంజ్‌డ్ ద వరల్డ్’కి ‘గ్రామీ’ అవార్డు గెలుచుకున్నారు. రిక్కీ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డుకు ఎంపికవగా, నీలా బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ కేటగిరిలో ఈ అవార్డు గెలుచుకున్నారు. రిక్కీ ఇంతకముందు కన్నడ చిత్రాలకు స్వరాలు అందించారు.

ఇది రిక్కీ 14వ ఆల్బమ్. నీలా వాస్వాని రచయిత్రి. ఆమె ‘వేర్ ద లాంగ్ గ్రాస్ బెండ్స్’ అనే చిట్టి కథల సంకలనాన్ని, ‘యూహవ్ గివెన్ మీ ఏ కంట్రీ’ అనే స్వానుభవ చరిత్రను రచించారు. సితార విద్వాంసుడు దివంగత రవిశంకర్ ప్రసాద్ కుమార్తె అనౌష్క శంకర్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో పోటీపడినప్పటికీ, అవార్డు గెలుచుకోలేకపోయారు. బ్రిటిష్ సింగర్ సామ్‌స్మిత్ పలు విభాగాల్లో 4 ‘గ్రామీ’ అవార్డులు అందుకున్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : grammy awards  Ricky Kej  Neela Vaswani  

Other Articles