Duplicate websites for lovers

duplicate websites, duplicate sites, new cyber crimes, valentine day

duplicate websites for lovers : be ware of duplicate sites which was created to cheat the lovers. they offer gifts on low cost.

ప్రేమికులారా.."బుక్" అవుతారు జాగ్రత్త..!

Posted: 02/10/2015 10:14 AM IST
Duplicate websites for lovers

ఇంటర్నెట్ తో ప్రపంచానికి దగ్గరగా చేరిన ప్రజలకు సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. అవకాశం దొరికితే అన్ని రకాలుగా దోచుకోవడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. సాధారణ నేరాలకు ధీటుగా సైబర్ నేరాల సంఖ్య వేగంగా సెన్సెక్స్ లా పెరుగుతోంది. నెటిజన్లు మాత్రం అంతాఅయిపోయాక మోసపోయామంటూ పోలీసుల ముందుకు వెళుతున్నారు.

ప్రేమికుల దినోత్సవం సమీపిస్తుండటంతో చాలా మంది యువత తమ ఇష్టమైన వారి కోసం నెట్ లో బహుమతి కోసం వెతకడం ప్రారంభించారు. దీన్నే కొంత మంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ వారి కోసం బహుమతుల వేటలో ఉన్న వారి కోసం కొత్తగా దొంగ వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో బహుమతుల ఇమేజ్ లు పెట్టి వాటిని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే అందిస్తామంటూ ప్రకటనలూ చేస్తున్నారు. తక్కువ ధర, ఆకర్షనీయమైన బహుమతి కదా అని చూస్తే మాత్రం మీ జేబుకు చిల్లుపడటం ఖాయం. దొంగవెబ్ సైట్ లలో ఆన్ లైన్ పేమెంట్ చేస్తే ఇక మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు గోవింద అవుతుంది. కాబట్టి ప్రేమికులారా ఇలాంటి వాటి బారిన పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : duplicate websites  duplicate sites  new cyber crimes  valentine day  

Other Articles