Indian pak match on the first sesson

india pak match, pak vs india, world cup

indian pak match on the first sesson..in this world cup pak india have crazy. foreigners buy tickets at cost 800 dollars.

చూడాలంటే క్రేజీ మ్యాచ్....కావాలి ఎక్స్ ట్రా క్యాష్

Posted: 02/10/2015 11:25 AM IST
Indian pak match on the first sesson

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ను చూడాలని అటు పాక్ ఇటు ఇండియా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లోనూ ఎంతో ఆసక్తి. ఈ మ్యాచ్ ను ఆటగా కాక దేశ పరువు ప్రతిష్ఠలుగా భావిస్తారు చాలా మంది. ఇలాంటి మ్యాచ్ ఈ ప్రపంచ కప్ ప్రారంభంలోనే ఉంది. ఇలాంటి మ్యాచ్ ను ఎవరు మాత్రం చూడాలనుకోరు. కానీ చాలా మంది క్రికెట్ అభిమానులు మాత్రం ఇప్పుడు ఈ మ్యాచ్ కు వెళ్లకపోవడమే మేలని భావిస్తున్నారు. ఇంతకీ అలా ఎందుకు అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ కథ చదవాల్సిందే.

రెండు దాయాది దేశాలు, ఒక దేశమంటే మరొక దేశానికి అస్సలు గిట్టదు. తమ దాయాది దేశానికి యుద్దానికి సిద్దమైనట్లు బాట్లు చేతిలో పట్టుకొని దిగుతారు. అభిమానులు నరాలు కదిలేలాగా, భూమి కంపించేలాగా అరుపులతో, తమ జట్టు గెలవాలని కోరుకుంటారు. వికెట్ పడితే ఒకవైపు ఆనందం, మరో వైపు నిరుత్సాహం ఇలా వైవిద్యానికి పెట్టింది పేరు భారత్ పాక్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ కు సంబందించిన టికెట్లను ఎంత ఖరీదైనా ఎగబడికొంటారు.

ఇలా టికెట్లను కొన్న చాలా మంది ఇప్పుడు ఈ మ్యాచ్ ను చూడడానికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారట. మ్యాచ్ సందర్భంగా హోటల్స్ రేట్లు భారీగా పెరిగాయట. ఎంతగా అంటే అప్పటి దాకా 100 డాలర్లు ఉన్న హోటల్ రెంట్ ఏకంగా 300 డాలర్లకు పెరిగింది. ఇలా అన్నింటి ధరలు ఆకాశానికి ఎగబారుతున్నాయట. దాంతో మ్యాచ్ చూడటం కంటే అదే డబ్బులతో భారత్ లో పది రోజులు టూర్ కు వెళ్లిరావచ్చిన చాలా మంది అనుకుంటున్నారు. ఇక టికెట్లు కొన్న వారి పరిస్థితి ఇలా ఉంటే టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్న వారి పరిస్థితి మరోలా ఉంది. మామూలుగా 200 లేదా 300 డాలర్ల మధ్యన ఉండే టికెట్ ధర ఏకంగా 800 డాలర్లు పలుకుతోందట. అంటే మన భారత కరెన్నీలో 40 వేల రూపాయలన్నమాట. ఇలా క్రికెట్ అభిమానులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది భారత్ పాక్ మ్యాచ్.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india pak match  pak vs india  world cup 2015  

Other Articles