ఘనమైన చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతినింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా పొందకుండా డకౌట్ అయ్యింది. ఇక ఘనమైన 120 ఏళ్ల చర్రిత వుందంటూ ఊదరగోట్టే పార్టీ నాయకులు, శ్రేణులు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. పార్టీలో ఎలా కొనసాగాలన్నది అర్థంకాక.. ఇప్పటికే పార్టీ నుంచి వేరే పార్టీలలో చేరిన తమ వారి అడుగుజాడల్లోనే నడిచేందుకు సిద్దమవుతున్నారు. అయితే పార్టీలోనే వుంటామని తేల్చుకున్న మరికోందరు మాత్రం పార్టీని బతికించుకునే చర్యలకు పూనుకున్నారు. తమ ఘనచరిత్ర.. ఎక్కడ చరిత్ర పుటలకే పరిమితం అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇందులో భాగంగా మళ్లీ పాత నినాదాన్నే భుజాలపైకి ఎత్తుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నుంచి తరచుగా వస్తున్న కాంగ్రెస్ వాదుల నినాదమే ఇది. రాష్ట్రాల ఫలితాలు వెలువడిన ప్రతీసారి.. కాంగ్రెస్ చరిష్మా పనిచేయలేదన్న, రాహుల్, సోనియాలకు బదులు ప్రియాంక లావో...కాంగ్రెస్ బచావో అంటూ కాంగ్రెస్ వర్గాల్లో నినాదాలు ప్రారంభమవుతాయి. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవకుండా కాంగ్రెస్ ఖతం అయ్యింది. గత ఎన్నికల్లో కనీసం 8 సీట్లైనా సాధించిన కాంగ్రెస్ ఈ సారి అవి కూడా లేవు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ భవితవ్యం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారో.. వేచి చూడాల్సిందే.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more