Anna hazare greets arvind kejriwal best wishes

anna hazare greets arvind kejriwal, hazare greets kejriwal, hazare greets best wishes to kejriwal, Hazare extends best wishes to kejriwal, Aam Admi Party, AAP leader Arvind Kejriwal, Delhi assembly election 2015. kiran bedi, narendra modi, Prime minister modi, amit shah, ajay maken, rahul gandhi, delhi assembly elections 2015 results

Gandhian activist Anna Hazare extended his "best wishes" to Arvind Kejriwal as his party headed for a landslide win in the Delhi assembly election.

అప్పటి తప్పిదాలను పునారావృతం కానివ్వకు.. కేజ్రీ

Posted: 02/10/2015 02:18 PM IST
Anna hazare greets arvind kejriwal best wishes

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. మహారష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ తన ఆయుధమైన అందోళన (పోరాటం)ను అపరాదని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో ప్రజాభిమాన్ని కేజ్రీవాల్ సంపాదించుకున్నారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయరాదని కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించారు. అయితే అప్పుడున్న పరిస్థితులకు.. ఇప్పుడున్న పరిస్థితులకు చాలా వత్యాసం వుందన్నారు. అప్పుడు మైనారిటీ ప్రభుత్వంలో వున్న కేజ్రీవాల్ కు ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఏకపక్ష మెజారిటీని అందించారని.. వారికిచ్చిన హామీలను నేరవేర్చుతూ కేజ్రీవాల్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. రైతుల భూములను అధికారులు లాగేసుకునే అధికారాన్ని సరళీకృతం చేశారని ఆరోపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anna hazare  arvind kejriwal  narendra modi  delhi assembly elections 2015  

Other Articles