Aravind kejriwal to take oath on 14th feb

Kejriwal to take oath on 14th febraury, anna hazare greets arvind kejriwal, hazare greets kejriwal, hazare greets best wishes to kejriwal, Hazare extends best wishes to kejriwal, Aam Admi Party, AAP leader Arvind Kejriwal, Delhi assembly election 2015. kiran bedi, narendra modi, Prime minister modi, amit shah, ajay maken, rahul gandhi, delhi assembly elections 2015 results

Arvind Kejriwal will take oath as the next chief minister of Delhi on Saturday i.e, 14th February at Ramlila Maidan after the spectacular victory in the Assembly elections.

ఏడాదే గడిచింది.. రాజీనామా రోజునే క్రేజీవాల్ ప్రమాణ స్వీకారం..

Posted: 02/10/2015 03:11 PM IST
Aravind kejriwal to take oath on 14th feb

ఫ్రిబవరి 14 ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పుల్ బిజీగా వుండే అరుదైన రోజు. ఆ రోజున తమకు అన్యాయం జరిగిందని ఢిల్లీ ప్రజలు అవేదనకు గురైన రోజు. గత ఏడాది కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్న అమ్ ఆద్మీ ప్రభుత్వానికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా పలికిన రోజు. గత ఏడాదిగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కోనసాగిన తరువాత ఇన్నాళ్లకు మళ్లీ ప్రజా ప్రభుత్వం రానుంది. అదీ హస్తిన ప్రజలకు కోరుకున్న వ్యక్తినే తమ నాయకుడిగా ఎన్నుకుని ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అయనే అరవింద్ కేజ్రీవాల్. ఒక సామాన్యుడు. అవినీతి రహిత భారత్ లక్ష్యంగా గాందేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజరే సాగించిన పోరాటంలో క్రీయాశీలకంగా పాల్లొని, రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు.

2015 ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీకి మరోసారి జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందలు చేస్తూ.. నమో మంత్రాలను ఢిల్లీలో వినిపించుకోకుండా అడ్డుకోగలిగిన ప్రజా నేత. అలాంటి నేతకు నూటికి 95 మార్కులు వేసి ప్రజలు ఆశీర్విదించారు. అంతే తాజాగా జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీ అభ్యర్థులు విజయ దు:దుభి మ్రోగించారు. అంతే ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలలో కేజ్రీవాల్ పార్టీకీ ఏకపక్ష విజయాన్ని అందించిన ప్రజలు అప్ కు చెందిన 67 మంది అభ్యర్థులను ఎమ్మెల్యేలగా గెలిపించి చట్టసభకు పంపారు. దీంతో కేజ్రీవాల్ ఈ నెల 14న ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

2013 డిసెంబర్ 28వ తేదీన కేజ్రీవాల్ సీఎంగా హస్తిన గద్దెను అధిరోహించినా.. అది మూన్నాళ్ల ముచ్చటిగానే మిగిలిపోయింది. కేవలం 49 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఆ పదవికి రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ తరువాత ప్రధాన పార్టీలు ఢిల్లీ గద్దెనెక్కడానికి యత్నించినా అక్కడ రాష్ట్రపతి పాలనే అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి  సీఎంగా పదవి చేపట్టిన కేజ్రీవాల్ 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేసిన పదవికి, ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది యాధృచ్చికంగా జరిగిందని భావించినా.. ఫిబ్రవరి 14వ తేదీ కేజ్రీవాల్ రాజకీయ జీవితంపై తీవ్ర  ప్రభావం చూపిందనే వాస్తవాన్ని మాత్రం అంగీకరించాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  swearin dermony  narendra modi  delhi assembly elections 2015  

Other Articles