Delhi election results 5 things that went wrong for bjp

victorious candidates of delhi assembly, delhi mlas, Kejriwal to take oath on 14th febraury, anna hazare greets arvind kejriwal, hazare greets kejriwal, hazare greets best wishes to kejriwal, Hazare \extends best wishes to kejriwal, Aam Admi Party, AAP leader Arvind Kejriwal, Delhi assembly election 2015. kiran bedi, narendra modi, Prime minister modi, amit shah, ajay maken, rahul gandhi, delhi assembly elections 2015 results

The Bharatiya Janata Party (BJP) was confident of getting a clear majority in Delhi after its stunning Lok Sabha win last year, but the party couldn’t seize the opportunity to tap the ‘Modi wave’. Here are the five major reasons that contributed the maximum to the BJP’s defeat

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేకం.. వాడిన కమలం కారణాలు

Posted: 02/10/2015 07:23 PM IST
Delhi election results 5 things that went wrong for bjp

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి సీన్ రివర్స్ అయ్యింది. బీజేపి నేతలు, శ్రేణులు సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ సర్వేలను పటాపంచలు చేస్తూ.. అమ్ అద్మీ పార్టీ రికార్డులను తిరగరాసింది. పార్టీకి చెందిన 67 మందిని ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసింది,. సామాన్యుల పార్టీకి సామాన్యుడు అసమాన్య తీర్పును ఇచ్చాడు. వందకు 96 మార్కులను వేశాడు దీంతో గతంలో కాంగ్రెస్ మద్దతుతో 49 రోజుల పాటు పాలించిన పార్ట.. ఈ దఫా ప్రతిపక్షమే లేని అధికారంతో ఢిల్లీ అభివృద్దికి శరవేగంగా అడుగులు వేయనుంది. తలచుకుంటే  ఏదైనా సాధ్యం చేస్తానని సామాన్యుడు మరోసారి నిరూపించాడు.  ఏ వేవ్‌ లేని చోట  ఓట్ల వేవ్‌ సృష్టించింది.  భారీ మెజార్టీతో దేశాన్ని ఏలుతున్న  కమలనాథుల్ని ఖంగు తినిపించింది.  మూడు స్థానాలకే  బీజేపీని పరిమితం చేశాడు

సామాన్యుడు.  ఇంత భారీ మెజార్టీ సాధిస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఊహించి ఉండదు.  ఢిల్లీలో ఓట్లేసిన 89 లక్షల మందిలో  సగం కంటే ఎక్కువ మంది ఆమ్‌ ఆద్మీ పార్టీకే ఓట్లేశారు. ఇంత తీవ్రమైన వ్యతిరేకత తమపై ఉందని బీజేపీ కూడా ఊహించి ఉండదు. ఆప్‌ సునామీలో కాంగ్రెస్‌ కొట్టుకుపోయింది.  ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు  ఫుల్‌ మార్కులు వేశారు.  పాసవుదామని కలలు కన్న ఆమ్‌ ఆద్మీని 96 మార్కుల వేసి పాస్‌ చేయించారు. తాను పట్టుకుంది చీపురని, అవినీతి ఊడ్చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ పక్షాన హస్తిన ప్రజలు నిలిచారు. గత 2013లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నే ఊడ్చేసిన కేజ్రీ.. ఈ సారి ఎన్నికలలో బీజేపిని కూడా కలపి ఊడ్చేశారు. 15 ఏళ్లు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్‌కు ఈసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా చేయడమే కాకుండా.. 32 స్థానాలతో గెలుచుకుని ఈ సారి విజయం కోసం వెంపర్లాడిన బీజేపిని కూడా అదే విధంగా ఖంగుతినిపించాడు.

70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం మూడు సీట్లు గెల్చుకుని ప్రతిపక్ష హోదా కూడా సాధించకపోగా,  రాకపోగా, కాంగ్రెస్ పార్టీ అయితే బోణీ కూడా కొట్టలేకపోయింది బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొన్న సర్వేల అంచానాలను తలకిందులు చేస్తూ.. ఆప్ ఘనవిజయం సాధిచింది. సర్వేలు, రాజకీయ పండితులు సైతం హస్తినలో ఆప్ సృష్టించిన సునామీని ఊహించలేకపోయారు. బీజేపీకి ప్రతిపక్ష స్థానం కూడా రాదని అంచనా వేయలేకపోయారు. ఆప్ది సర్వేలకు సైతం అందని అసమాన్య విజయం. కేజ్రీవాల్ ఛరిస్మా ముందు మోదీ హవా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం, కిరణ్ బేడీ నేపథ్యం.. ఏవీ పనిచేయలేకపోయాయి. ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే ఆప్ సంచలన విజయం సాధించింది.

కిరణ్ బేడీ ఎంపికే కారణమా..?

హస్తిన ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా... కిరణ్ బేడీ చేరికతో అవి తారుమారయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ రోజుకు కేవలం రెండు వారాల ముందే ఈ అంచనాలు తారుమారయ్యాయి. ఢిల్లీలో కిరణ్ బేడీ తన ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ఓటర్లను ఎంత మాత్రం ఆకట్టుకోలేక పోయారని అంటున్నారు. కిరణ్ బేడీ చేరికే బీజేపీ పరాజయానికి కారణమా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ రాజకీయ వర్గాలు. అటు ఢిల్లీ ఓటర్లు కూడా క్లీన్ ఇమేజ్ కలిగిన కిరణ్ బేడీ బీజేపీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతే కాదు బేడీ రాకతో పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసింది. ముఖ్యంగా కృష్ణ తీరథ్ లాంటి సీనియర్ నాయకులతో బేడీకి సమన్వయం కుదురలేదు. ఢిల్లీలో కిరణ్ బేడీ బీజేపీ ఓటు బ్యాంకును పెంచడంలో ఏ మాత్రం దోహదపడ లేదిని పార్టీ వర్గాలు అరోపిస్తున్నాయి.

స్థానిక నేతలు లేకపోవడమే కారణమా..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పార్టీకి సారథ్యం వహించిన హర్షవర్దన్ లాంటి స్ధానిక నాయకుడు లేకపోవడంతో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం కూడా బీజేపీకి నష్టం కలిగించింది. గత ఎన్నికల్లో మాదిరి బీజేపీ మేనిఫెస్టోకు బదులుగా విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలోకి పార్టీ సీనియర్ నాయకులను, కేంద్ర మంత్రులను దింపినా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీవైపే మొగ్గు చూపారు. అందుకు కారణం వారెవరూ స్థానిక నాయకులు కాకపోవడం వల్ల వారెవరికీ స్థానిక సమస్యలపై పట్టులేక పోవడం కూడా ఆప్‌కి కలిసి వచ్చింది.

తమ మధ్య చీలికను పపిగట్టిన ప్రజలు..?

సరిగ్గా ఢిల్ీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ఫీఠాన్ని కైవసం చేసుకునే పనిలో భాగంగా తాను తలపట్టిన వ్యూహాలను ప్రజల్లోకి పంపించి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయోనని వేచి చేసిన బీజేపికి మొదటికే మోసం వచ్చింది. ఎన్నికలకు వెళ్లకుండానే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని భావించిన బీజేపికి ఆ దిశగా మార్గాలు కనరాకపోవడంతో.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపి.. ప్రజలను విడదీయాలని యత్నించింది. పార్టీ అదేశానుసారం ఢిల్లీలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి సాధ్వీ.. చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయితే దేశరాజధాని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలించింది. పార్టీ నేతల వ్యాఖ్యాలు పార్లమెంటును స్థంభింపజేసినా.. ప్రజలు మాత్రం శాంతి సహనాల మధ్య సమన్వయాలతో మెలిగారు.

సరిగ్గా ఎన్నికల ముందు అప్ చీలికకు యత్నం..?

ఎన్నికలకు ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం సమర శంఖారావాన్ని పూరించకుండానే.. రంగంలోకి దిగి ప్రచారం చేసిన బీజేపి నేతలు.. అప్పటికే ఎన్నెన్నో వ్యూాలను రచించారు. అకస్మాత్తుగా తెరపైకి సముచిత స్థానంలో వున్న వ్యక్తులను తీసుకువస్తే.. తమకు లాభాం చేకూరుతుందా అని భావించారు. చాప కింద నీరులా చేసిన ప్రచారం.. ఒక స్థాయిలోనే వెళ్తున్నా.. దానిని అందిపుచ్చుకునే క్రమంలోనే అసలు పోరబాటు జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేవ్ రాస్ట్రానికి చెందిన సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రదను ఢిల్లీ గద్దెపై ఎక్కేందుకు తమ అభ్యర్థిగా తీసుకువస్తున్నట్లు వార్తలు లీక్ అయ్యాయి. దీనికి అమె కూడా సై అన్నారు. అయితే క్లీన్ ఇమేజ్ వున్న అమెను వదిలి.. ఆ తరువాత అప్ బహిష్కృత నేత షాజియా ఇల్మీని పార్టీలోకి చేర్చుకుని అమెతో కేజ్రీవాల్ కు పోటీనివ్వాలని భావించారు. వివాదాస్పద ప్రచారంతో కెమెరాలకు చిక్కిన ఇల్లీని ఎలా పదవులిస్తారన్న ఆరోపణల నేపథ్యంలో అమెను పక్కన బెట్టారు. చిట్టచివరకు అరవింద్ తో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్న ఐపీఎస్ అధికారని కిరణ్ బేడీని తెరపైకి తీసుకువచ్చింది బీజేపి. అమె తన శాయశక్తులా కృషి చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అకస్మాత్తుగా ఆప్ కు పెరిగన ప్రజాబలం

బీజేపి జాతీయ పార్టీ అదేశానుసారం ఢిల్లీ బీజేపి శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలు కూడా కేజ్రీవాల్ కు కలిసోచ్చాయి. రోజు రోజుకు ఏదో ఒక అంశంతో అప్ పార్టీని, అరవింద్ కేజ్రీవాల్ ను ఇరుకునపెట్టేందుకు బీజేపి శాయశక్తులా ప్రయత్నించింది. వారికి తోడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా కెజ్రీవాల్ స్థానికతపై న్యాయస్థానానికి వెళ్లడం కూడా ప్రజల్లో హేయభావాన్ని తీసుకువచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ను కులం పెరుతో ధూషిణ, భూషణలు చేయడం కూడా బీజేపి ద్వంద వైఖరిని ప్రజలకు స్పష్టం చేసింది. అది చాలదన్నట్టు మార్పు తీసుకువస్తానని చెప్పి కేంద్రంలో ముఫై ఏళ్ల తరువాత మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేవలం విమర్శలకు, ప్రాథాన్యత ఇవ్వడం తప్ప.. ఎనమిది మాసాల్లో ప్రజలకు చేసిన మంచి చెప్పుకునే విధంగా లేకపోవడం కూడా ఇందుకు కారణంగా నిలుస్తోంది.

అయితే మోడీ ఎనమిది నెలల కాలం పాలనతో పాటు కేజ్రీవాల్ గతంలో సాగించిన 49 రోజుల పాలనను బేరీజు వేసుకున్న ప్రజలు సామాన్యుడి పక్షాన నిలిచారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనలో మోడీ 30 లక్షల విలువ చేసే కోటు ధరించడం కూడా బీజేపీకి ప్రతికూల ప్రభావం చూపించదని అన్నారు. దీనికి తోడు మార్పు కు నాంది పలుకుతానన్న ప్రధాని నేతృత్వంలోని పార్టీ.. దిగజారుడు తనానాకి పాల్పడుతూ.. కేజ్రీవాల్ వ్యతిరేకంగా కార్టూన్ల రూపంలో ప్రకటనలు గుప్పించడం కూడా ప్రజలను అలోచింప చేసింది. మొత్తాన్నికి కర్ణుడి చావుకు శతకోటి కారణాలు అన్నట్లు.. అప్ విజయధ:దుభి మ్రోగించడానికి కూడా శతకోటి కారణాలున్నాయంటున్నారు ఢిల్లీ వాసులు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi assembly  AAP  BJP  congress  

Other Articles