Student accidental fall in well at sulthanabad

student accidental fall in well, student accidental fall in well at sulthanabad, student accidental fall in well at karimnagar, student fell in well, co students rescued, sulthanabad, karimnagar district, sc girls hostel sulthanabad, sc girls hostel warden sumathi, student, accident, well, sulthanabad, karimnagar distirict

student accidental fall in well at sulthanabad of karimnagar district

ఆ విద్యార్థిని బావిలో పడిందా..? దూకిందా..? లేక...?

Posted: 02/14/2015 09:19 PM IST
Student accidental fall in well at sulthanabad

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని బావిలో పడింది. సుల్తానాబాద్‌లోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటున్న అనూష(15) గత మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో అనూష మూడు రోజులగా పాఠశాలకు వెళ్లడం లేదు. హాస్టల్ లోనే విశ్రాంతి తీసుకుంటోంది. అయితే శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా హాస్టల్ దగ్గర ఉండే బావిలో ప్రమాదవశాత్తు పడింది. స్థానికంగా ఉన్న యువకులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

అయితే హాస్టల్లో ఉండాల్సిన అనూష బావి వద్దకు ఎందుకు వెళ్లిందన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి వుంది. ఇంతకీ అమెది ప్రమాదమా...? లేక ఆత్మహత్య, లేక మరింకేదైనా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి, ఈ విషయంపై వార్డెన్ సుమతిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులను అడగ్గా వార్డెన్ హాస్టల్‌కు అప్పడప్పుడు వస్తుందని చెప్పారు. వార్డన్ భర్త మొత్తం హాస్టల్ నిర్వహణ చూస్తారని విద్యార్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  accident  well  sulthanabad  karimnagar distirict  

Other Articles