Protest on firing at govind pansare in maharastra

Govind Pansare, firing at govind pansare,the attack on Govind Pansare, Communist Party of India supporters protest

protest on firing at govind pansare in maharastra: Communist Party of India supporters stop the car of Maharashtra Home Minister Ram Shinde during a protest to condemn the attack on veteran Communist leader Govind Pansare, in Kolhapur, Maharashtra on Monday.

సిపిఐ నేతపై కాల్పులు...చెలరేగిన నిరసనలు

Posted: 02/17/2015 01:06 PM IST
Protest on firing at govind pansare in maharastra


టోల్ టాక్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న గోవింద్ పన్సారి, ఆయన భార్య జరిగిన దాడిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సిపిఐ కార్యకర్తలు మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు చోట్ల ర్యాలీలు నిర్వహించి, నిరసన తెలిపారు. అయితే నిరసనలు అంతకంతకు ఎక్కువవుతుండటంతో మహారాష్ట్ర పోలీసులకు తలనొప్పిగా మారింది. నిన్న గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర కోలాపూర్ లొని గోవింద్ పన్సారి ఇంటి వద్దకు వచ్చి, చాలా దగ్గరి నుండి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో గోవింద్ పన్సారికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆయన భార్య ఉమకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. దాంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిందుతులను పట్టుకోకపోవడంపై, వామపక్షనేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర హోం మినిస్టర్ కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వామపక్ష కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వెంటనే ఘటనపై స్పందించారు. గోవింద్ పన్సారి కుటుంబంపై జరిగిన కాల్పులను ఆయన ఖండించారు. నిందితులను పట్టుకునేందుకు వెంటనే పది పోలీసులు బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. కాల్పుల్లో గాయపడిన గోవింద్ పన్సారి భార్య ఉమ తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles