Fevikwik add make contraversy

fevikwik add, fevikwik contraversy, hindu janajagruthi

fevikwik add make contraversy : fevikwik made a add recently. some institutions oppose the add. they said that add abolish our jawans.

ITEMVIDEOS: వివాదస్పదంగా మారిన ఫెవిక్విక్ యాడ్..!?

Posted: 02/17/2015 01:00 PM IST
Fevikwik add make contraversy

ఫెవికాల్ యాడ్స్ రొటీన్ కు కాస్త భిన్నంగా ఉంటాయి. పిడిలైట్ వారి ఫెవిస్టిక్, ఫెవిక్విక్ యాడ్ లు కూడా బాగా ఉన్నాయి. కానీ ఫెవిక్విక్ యాడ్ పై కొందరు మండిపడుతుంటే, కొందరు మాత్రం చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఈ యాడ్ లో బూతులు ఉన్నాయని అనుకుంటున్నారేమో అలాంటిదేమీ లేదు. పక్కా యు సర్టిఫికెట్ కమర్షియల్ యాడ్. కానీ ఈ యాడ్ లో మన దేశ సైనికులను అవమానించారని హిందు జనజాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా, దేశ రక్షణను చేస్తుంటే, వారి త్యాగాలను మరిచి ఇలా చీప్ గా చూపించడం ఏంటని వారు మండిపడుతున్నారు. మరో పక్క కొంత మంది మాత్రం పాకిస్థాన్, భారత్ ల మధ్య స్నేహానికి ప్రతీకగా ఈ యాడ్ ను పొగుడుతున్నారు.

ఇంతకీ ఆ యాడ్ లో ఏముంది అనుకుంటున్నారా.. భారత్, పాక్ బోర్డర్ లో రెండు దేశాలకు చెందిన సైనికులు కవాతు నిర్వహిస్తుంటారు. అందులో పాక్ సైనికుడి బూటును భారత సైనికుడు ఫెవిక్విక్ తో అతికిస్తాడు. కేవలం విడగొట్టడమే కాదు కలపడానిని అంటూ సిరఫ్ థోడ్ నేకా నై జోడ్ నేకా అని యాడ్ ముగుస్తుంది. కానీ భారత జవాను పాకిస్థాన్ సైనికుడి బూటును పట్టుకోవడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా ఈ యాడ్ రూపుదిద్దుకుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fevikwik add  fevikwik contraversy  hindu janajagruthi  

Other Articles