జమ్మూకాశ్మీర్ రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. చాలా సార్లు చర్చల తర్వాత పిడిపి, భాజపా పొత్తు కుదిరినట్లు సమాచారం. అయితే పిడిపి పట్టుబట్టినట్లు 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చెయ్యాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ లో కేంద్ర బలగాలకు హక్కులను కల్పిస్తున్న చట్టాలను రద్దు చెయ్యాలని, పౌరులకు పూర్తి హక్కులు కల్పించాలని పిడిపి ప్రధానంగా డిమాండ్ చేసింది. అయితే కేంద్ర బలగాల హక్కుల విరమణ గురించి మిలిటరీ అధికారులతో చర్చించి, ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని భాజపా తెలిపినట్లు తెలుస్తోంది.
మొత్తానికి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ప్రభుత్వాన్ని పీడీపీ, బీజేపీలు కలిసి ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఫలితంగా ముఖ్యమంత్రిగా పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు బాధ్యతలు చేపట్టే అవకాశముంది. దీంతో మరో వారం రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ప్రస్తుతం గవర్నర్ పాలనలోనున్న ఈ రాష్ట్రంలో... ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ -బీజేపీ సిద్ధమయ్యాయి. జమ్మూకశ్మీర్ పాలన కోసం అనుచరించాల్సిన విధి విధానాలు దాదాపు ఖరారయ్యాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more