Three indians in 100 shortlisted for one way trip to mars

Mars Mission, Mars trip by human beings, Indians in the list of Mars tour, Mars One organization, Taranjeet Singh Bhatia, Ritika Singh Mars, Shradha Prasad Mars trip, Shradha Prasad

After several rounds of selection processes only 100 hopefuls have been selected to proceed to the next round among 202,586 applicants. The list embraces 3 Indians.

మార్స్ యాత్రకు ఎంపికైన ముగ్గురు భారతీయులు..

Posted: 02/17/2015 03:19 PM IST
Three indians in 100 shortlisted for one way trip to mars

మంగళయానం. అంగారక గ్రహం మీదకు యాత్ర చేయడమంటే మాటలా. సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. అసలు ఇంతకీ మంగళయానం సాధ్యమా అన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తక మానదు. అరుణగ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి దానిని విజయవంతం చేయడంలోనే ఇప్పటికీ పలు దేశాలు విఫలమైన నేపథ్యంలో మర్స్ యాత్ర అంత అశాజనకంగా వుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా, నెదర్లాండ్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ 2024లో అంగారక యాత్ర నిర్వహించనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు భారతీయులు ...చివరి నాలుగో రౌండ్కు ఎంపికయ్యారు. జీవితంలో ఒకసారి మాత్రమే చేయగలిగే ఈ యాత్రకి అతి పిన్న వయస్కురాలైన ఓ భారతీయురాలు సెలక్ట్ అవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మార్స్ యాత్రను చేపట్టనుంది. అరుణ గ్రహంపైకి పంపిస్తున్న ఈ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా 705 మందిని పంపిస్తున్నారు. యాత్రలో పాల్గొనేందుకు సుమారు 2,02,586 దరఖాస్తులు వచ్చాయి. కాగా అంగారక యాత్ర చేపట్టేందుకు ఎంపిక చేసిన వంద మంది జాబితాలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. వీరిలో కేరళకు చెందిన 19 ఏళ్ల శ్రద్ధా ప్రసాద్ ఒక్కరే ప్రస్తుతం భారత్ (కేరళ) లో ఉంటున్నారు.  ఎంపికైన తరన్ జీత్ సింగ్, రితికా సింగ్ ఇద్దరు ప్రవాస భారతీయులు. తరన్ జీత్ సింగ్ భాటియా సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తుండగా, రితికా సింగ్ ప్రస్తుతం దుబాయ్లో స్ధిరపడ్డారు.  

అంగారకుడిపై శాశ్వతంగా మానవ ఆవాసాన్ని ఏర్పాటు చేసే దిశగా వీరు ప్రయత్నాలు చేయడం కోసం తలపెట్టినదే ఈ యాత్ర. మొత్తంగా 40 మందిని అంగారక గ్రహంపైకి పంపించాలన్నది ఈ మిషన్ ఉద్దేశం. ప్రతి రెండేళ్లకు నలుగురిని మార్స్ యాత్రకి పంపుతారు. అన్ని రౌండ్ లను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చి ఈ యాత్రకు పంపిస్తారు. ప్రస్తుతం 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 100 మంది సెలక్ట్ కాగా వీరిలో మహిళలు 50, పురుషులు 50 మంది స్థానం సంపాదించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mars Mission  Mars trip by human beings  3 Indians  

Other Articles