Minor girl gang rapped in howrah

minor girl gang rape, minor girl lost her way while returning home, Shivratri festival, minor girl unconscious state, Gangrape, West Bengal, Howrah district, Gadiara under Shyampur area,

A 15-year old girl was gang-raped, allegedly by five youths at Shyampur in Howrah district, a senior police officer said on Friday.

హౌరాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..

Posted: 02/20/2015 05:12 PM IST
Minor girl gang rapped in howrah

ఫుణ్యానికి పోతే పాపం ఎదురైందన్న చందాన.. తల్లితో పాటు శివరాత్రి ఉత్సవాలకు వెళ్లిన ఓ మైనర్ బాలికను ఐదుగురు కామాంధులు కాటేశారు. తల్లి నుంచి విడిపోయి.. తప్పిపోయిన బాలికపై మగమృగాళ్లు కామవాంఛతో విరుచుకుపడ్డాయి. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాలో నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాత్రి మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ మైనర్ (15 ఏళ్ల బాలిక) దారి మధ్యలో తప్పిపోయింది.

దీంతో ఇంటికి వెళ్లే మార్గం కూడా తెలియకపోవడంతో తప్పిపోయిన ఏడుస్తూ వెళ్తోంది. బాలికను గమనించిన గ్రామ యువకులు అమెకు దారి చూపిస్తామంటూ నిర్ఝన ప్రాంతానికి తీసుకువెళ్లిన అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. శ్యాంపూర్ కు సమీపంలో నిర్మానుష ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను  గుర్తించిన  పోలీసులు వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి తరలించారు. దుండగులు ఆమెను  నిర్జన  ప్రాంతంలోకి బలవంతంగా తీసుకుపోయి ఈ దురాగతానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారానికి ఫాల్పడిన నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగిలిన ముగ్గురి కోసం అన్వేషిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Howrah  minor girl  gang rape  

Other Articles