Good news very soon on power tariff free water

Good news very soon on power tariff, power tariff cut, free water, Kejriwal to keeps poll promises, anna hazare greets arvind kejriwal, hazare greets kejriwal, hazares best wishes to kejriwal, Hazare extends best wishes to kejriwal, Aam Admi Party, AAP leader Arvind Kejriwal, Delhi assembly election 2015. kiran bedi, narendra modi, Prime minister modi, amit shah, ajay maken, rahul gandhi, delhi assembly elections 2015 results anna hazare, Aam Aadmi Party's (AAP), governance, election promises, free water, Power tariff, garden, Tourism, South Delhi, manifesto, wi-fi

The Chief Minister said his government was also working on implementing the poll promise of free wi-fi and added that it will take at least one year.

విద్యుత్, తాగునీరుపై త్వరలోనే శుభవార్త..

Posted: 02/20/2015 06:07 PM IST
Good news very soon on power tariff free water

అమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి ఇంకా వారం రోజులు కూడా గడవక ముందే.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు పూనుకున్నాడు. సామాన్యుడినని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్రమోడీ గాలికి ఎదుర్కోని... తనను అనన్యసామాన్యమైన మెజారిటీతో గెలిపించిన ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకునే పనిలో పడ్డారు. మరోలా చెప్పాలంటే ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే సరిగ్గా వారం కూడా గడవక ముందే ఆయన తన హామీల అమలుకు కసరత్తును ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే ఢిల్లీ ప్రజలు విద్యుత్ చార్జీల విషయంతో పాటు తాగు నీటి సరఫరా విషయాల్లో శుభవార్తను వింటారని చెప్పారు. త్వరలోనే విద్యుత్ చార్జీలలో కోత, ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. ఈ పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్దం చేసినట్లు ఆయన చెప్పారు. ఇక ఢిల్లీని పూర్తి వైఫై నగరంగా మార్చేందుకు సుమారు ఏడాది కాలం పడుతోందని చెప్పారు. త్వరలోనే విద్యుత్ చార్జీల రేట్లను తగ్గిస్తూ శుభవార్తనందిస్తామని చెప్పారు. గతంలో తమ పాలన సాగించిన క్రమంలో అనుసరించిన విధానాన్నే ఇకపై కూడా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ వాసులు తమకు ఆరోగ్యకరమైన మెజారిటీతో కూడిన విజయాన్ని అందించారని, ఇది తమకు బరువుగానూ, బాధ్యతగానే భావిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు.

గతంలో 49 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఢిల్లీ ప్రజలకు సేవలందించిన ఆయన.. అప్పుడు చేసిన ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజలను అకట్టుకున్నారు. ఒక దశలో ఆనాటి పథకాలు కూడా కేజ్రీవాల్ తిరుగులేని గెలుపుకు బాటలు వేశాయి. ఈ క్రమంలో ఫూర్తి మోజారిటీని అందించిన ఢిల్లీ ప్రజలపై ఆయన వరాల జల్లు కురిపించే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే ఆదాయం లేకుండా కేవలం రాయితీలతో ఎంతకాలం ప్రభుత్వాన్ని నెట్టుకోస్తారన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  aam aadmi party  bjp  delhi power and water  

Other Articles