Jayalalithaa said to fan who nailed himself to cross for her

jayalalitha, annadkm, tamilnadu, fan,birthday, chennai, hammered

Hussaini had six-inch nails hammered through his hands and feet in Chennai in an act that he hoped would result in her return as Chief Minister of Tamil Nadu. In a letter to an admirer who has nailed himself to a cross in Chennai for her, J Jayalalithaa writes,

శిలువ ఎక్కిన బిడ్డ..బాధపడ్డ తల్లి

Posted: 02/24/2015 11:49 AM IST
Jayalalithaa said to fan who nailed himself to cross for her

ఎవరైనా పుట్టినరోజు కానుక  గుర్తుండిపోయేలా ఇవ్వాలనుకుంటారు. కానీ తమిళనాడు మాజీ మఖ్యమంత్రి జయలలితకు ఓ అభిమాని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. తమిళనాట జయలలిత పై అభిమానాన్ని ఎవరూ ప్రశ్నిచలేరు. ఎంతలా అంటే ఆమెను పేరు పెట్టి పిలిచే వారి సంఖ్య చాలా తక్కువ చాలా మంది ఆమెను అమ్మ అనే పిలుస్తారు. ఇలా తమిళనాట ప్రజల అభిమానాన్ని సంపాదించిన జయలలిత పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా తయారు చేశాడు ఓ వీరాభిమాని. అయితే తన అభిమాని బాధను అర్థం చేసుకుంది జయలలిత. జైలు నుండి ఆ అభిమానికి ఓ లేఖ రాసింది.

హుస్సైనీ అనే అభిమాని జయలలిత జైలు నుండి బయటకు రావాలని ఏకంగా శిలువ ఎక్కాడు.  సర్వమత ప్రార్థనలు చేసి.. శిలువ ఎక్కిన హుస్సైనీ పదినిమిషాలపాటు అలాగే వేలాడి తానెందుకు ఇలా చేయాల్సివచ్చిందో వివరించారు. తమిళనాడు ప్రజలకు అమ్మే దైవమంటూ శిలువపైనే జయలలిత నామజపం చేసిన హుస్సైనీ . తర్వాత కొట్టించుకున్న మేకులు తొలగించుకుని అస్పత్రికి పరుగులు తీశారు. గతేడాది జయలలిత జన్మదినానికి విగ్రహాన్ని తయారు చేసేందుకు ఏకంగా తన రక్తాన్ని ఉపయోగించి రికార్డు సృష్టించాడు హుస్సేనీ.

letter

తాజాగా జయలలిత ఈ ఘటనపై ఓ లేఖ రాసింది. ఇంకెప్పుడు బాధ కలిగించే ఇలాంటి పనులు చెయ్యవద్దని సలహా ఇచ్చింది. నాకు మద్దతుగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకోసం చాలా బాధను అనుభవించావు. ఈ సంగతి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను అని జయలలిత తన లేఖలో రాసింది. ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడవద్దని, శరీరాన్ని గాయపరచకు అని జయలలిత ఆ అభిమానికి సూచించింది. మొత్తానికి తల్లి సూచనను పాటించి, మరోసారి ఇలాంటివి చెయ్యకపోతే మేలని అందరు అనుకుంటున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  annadkm  tamilnadu  fan  birthday  chennai  hammered  

Other Articles