ఇండియా మోస్ట్ వాంటెండ్ మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులలో ఒకడైన గ్యాంగ్ స్టర్ అబూసలేంకు న్యాయస్థానం జీవిత కారాగార శిక్షను విధించింది. ముంబాయిలోని ప్రత్యేక టాడా కోర్టు ఈ మేరకు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. గ్యాంగ్ స్టర్ అబుసలేంతో పాటు అతని డ్రైవర్ యోహంది హసన్ కూడా ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారగారా శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో మరో నిందితుడు బిల్డర్ అయిన 86 ఏళ్ల వీకే ఝాంబ్ కు కూడా కారాగార శిక్షను విధించింది.
కాగా ఝంబ్ ఇప్పటికే తన కారాగార శిక్షను పూర్తి చేసుకున్న నేపథ్యంలో వీల్ చైర్ పనున్న ఝంబ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా వదిలిపెట్టారు. ప్రదీప్ జైన్ అతడి సోదరుడు సునీల్‌తోపాటు పలువురు బిల్డర్లను సలేం బెదిరించి భయకంపనలు సృష్టించాడని కోర్టు నిర్ధారించింది. ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్‌ను తుపాకీతో కాల్చి చంపారని కోర్టు పేర్కొంది.
కాగా ప్రదీఫ్ తరపున న్యాయవాదులు అబు సలేం సహా నిందితులందరికీ మరణ శిక్ష విధించాలని న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. అయితే మన దేశం నుంచి పారిపోయిన అబుసలేంను పోర్చుగల్ పోలీసులు ముంబాయ్ పోలీసులకు అప్పగించిన క్రమంలో మళ్లీ వారికి తిరిగి అప్పగించాల్సిన బాధ్యత ముంబై పోలీసులపై ఉన్న నేపథ్యంలో మరణశిక్షకు బదులు జీవిత ఖైదు శిక్షను విధించాలని న్యాయవాధి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more