మహిళలపై అకృత్యాలు , అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం పలు కొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది అందులో భాగంగా కీలక ప్రతిపాదనలు చేస్తోంది. గతంలో బస్సు ప్రయాణాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఎం దృష్టికి రావడంతో, బస్సులో మహిళల కోసం ప్రత్యేకంగా క్యాబిన్ ను ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీంలు తెలంగాణలో మంచి ఫలితాలనిస్తున్నాయి. అమ్మాయిలను, మహిళలను వేధించే వారికి షీటీం సింహస్వప్నంగా మారుతోంది. షీటీంల ఏర్పాటు తర్వాత తెలంగాణలో టీజింగ్ తగ్గిందని తేలింది. దాంతో వాటిని మిగిలిన జిల్లాలకు విస్తరించాలని తెలంగాణ ప్రభత్వం నిర్ణయించింది,
అదే తరహాలో మహళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రచిస్తోంది. అందులో భాగంగా రైల్వే పోలీస్ ల ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఒక డీఎస్పీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లతో పాటు 15 మంది సిబ్బం ది ఉండే ఈ యూనిట్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంనుంచి ట్రాఫికింగ్ జరిగే మార్గాలపై నిఘా ఉంచడమే కాకుండా భారీ స్థాయిలో ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలో వివిధ అంశాలను సమీక్షించి తుది ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ముందు ఉంచుతారు. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యానిట్లు లేకపోవడం గమనార్హం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more