Suresh prabhu debut railway budget

Suresh Prabhu debut railway budget, railway budget 2015, Railway Minister Suresh Prabhu, suresh prabhu tabled railway budget, Railway finances under terrible strain, Suresh Prabhu will hike the fares, budget initiatives besides enhancing safety and security, railway budget will hike freight charges,

Railway Minister Suresh Prabhu debut Rail Budget may contain proposals for 'Make in India' initiatives besides enhancing safety and security.

పార్లమెంటుకు వెళ్తూ.. మీడియాతో రైల్వే మంత్రి సురేష్ ప్రభు..

Posted: 02/26/2015 11:45 AM IST
Suresh prabhu debut railway budget

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తొలిసారిగా పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఇందుకోసం ఆయన రైల్ భవన్ నుంచి బయలు దేరి పార్లమెంట్ కు చేరుకున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ రైల్వే ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైల్వేలో సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైల్వేలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నూరుశాతం అమోదానికి తమ ప్రభుత్వం అనుమతించిందని, తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు.

ప్రధాని మోదీ రైల్వే శాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రైల్వేలలో మెరుగైన వసుతుల కల్పన తో పాటు ప్రయాణికుల భద్రతపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రయాణ ఛార్జీల పెంపు, కార్గో చార్జీలపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకంటామని సురేష్ ప్రభు తెలిపారు. ఈ బడ్జెట్‌లో రైల్వే ఆధునీకరణ, విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway budget 2015  Railway Minister  Suresh Prabhu  

Other Articles