2015-2016 సంవత్సరానికి రైల్వే వార్షిక బడ్జెట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తొలిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా బడ్జెట్ లో పోందుపర్చిన అంశాలను లోక్ సభలో సభ్యులకు తెలియజేస్తూ.. ప్రసంగం ప్రారంభించారు. రైలు ప్రయాణికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బడ్జెట్ లో కేంద్రమంత్రి వారికి తీపి కబురును అందించారు. గత ఏడాది ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం మేర పెంచి వాత పెట్టిన దరిమిలా.. ఈ ఏడాది అందుకు పూర్తి భిన్నంగా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల చార్జీలపై ఎలాంటి భారం వేయకుండా చర్యలు తీసుకుని వారికి శుభవార్తను అందించారు.
పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో ముఫై ఏళ్ల తరువాత వచ్చిన సుస్థిర, ధృడమైన ప్రభుత్వం రైల్వేలను మార్చితీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపై రైళ్లు నిర్ధేశిత సమాయాలకు వచ్చేట్లు చర్యలు చేపడుతున్నామని సురేశ్ ప్రభు తెలిపారు. తనకు కేంద్ర రైల్వేశాఖ పదవినిచ్చి.. రైల్వేల మార్పు బాద్యతను సవాల్ గా అందించిన ప్రధాని నరేంద్రమోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
* దేశ సామాజిక ప్రగతిలో రైల్వేలది కీలక భూమిక
* మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం పేదరిక నిర్మూలనే
* రైల్వేలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తాం
* మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే అదనపు పెట్టుబడులు అవసరం
* రాజధాని, శతాబ్ధి రైళ్లు 170 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించగలవు
* పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి ప్రాధాన్యత
* భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన
* రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
* రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది
* అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది
* రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది
* పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి
* ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి
* పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం
*గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more