రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ...దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన చెప్పటం విశేషం. దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. బొగ్గు రవాణా ఛార్జీ 6.3 శాతం, సిమెంట్ 2.7 శాతం, యూరియ 10 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ఛార్జీలు 1 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంది.
రైల్వే బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి సురేష్ ప్రభు ఏ మాత్రం కరుణ చూపలేదు. రైల్వే బడ్జెట్లో వంద లోపు కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయని వచ్చిన వార్తలు కేవలం వార్తలుగానే వుండిపోయాయి. సురేష్ ప్రభు తొలిసారిగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలు కానీ, కొత్త జోన్ కానీ లేదు. ప్రతిపాదనలు, కేటాయింపుల ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. గతానికి భిన్నంగా రైల్వేల గురించి మాత్రమే సురేశ్ ప్రభు ప్రసంగించారు. దీంతో విశాఖ వాసులు ఎంతో కాలంగా నినదిస్తున్న ప్రత్యేక జోన్ ఈ ఏడాది కూడా అటెక్కెక్కింది. ఇటు ఎంఎంటీఎస్ రెండో దశ పనులపై కూడా ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో హైదరాబాద్, శివారు ప్రాంత ప్రజలకు ఈ సారి బడ్జెట్ లోనూ రిక్తహస్తాలు అందించారు.
రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ...దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన సూచించారు. దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. బొగ్గు రవాణా ఛార్జీ 6.3 శాతం, సిమెంట్ 2.7 శాతం, యూరియ 10 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ఛార్జీలు 1 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంది.
మరోవైపు దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు కొత్తగా వినోదాన్ని కూడా జోడిస్తున్నారు. ఇంతకాలం ఈ రైళ్లలో ఉచితంగా టీ, స్నాక్స్, భోజనాలు ఇచ్చేవారు. టికెట్ ధరలోనే వీటి ధర కూడా కలిపి ఉండేది. ఇది ప్రయాణికులకు చాలా సౌఖ్యంగా ఉండేది. దూరప్రయాణాల్లో ప్రత్యేకంగా భోజనాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్లలో నాణ్యమైన ఆహారమే అందించేవారు. ఇప్పుడు దీనికితోడు వినోదాన్ని కూడా జోడిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more