లోక్సభలో ఇవాళ తొలిసారిగా రైల్వే మంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సురేష్ ప్రభు బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరిచాయి. సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం మాటలతో మభ్యపెట్టే రైల్వే బడ్జెట్ అని కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రైల్వే బడ్జెట్ పై ఆయన స్పందించారు. 'రైల్వే బడ్జెట్ దిశానిర్ధేశం లేకుండా వుందని విమర్శించారు. బడ్జెట్ లో పేర్కొన్న అంశాల అమలుకు కేవలం ప్రస్తావనకే పరిమితమైందన్నారు ప్రభుత్వం మాటలతో మాయలు చేస్తుందన్నారు.
బడ్జెట్ అమలుకు, వనరుల్ని పెంచుకోవడానికి ప్రణాళికలు ఏమీ లేవు. విజన్ డాక్యుమెంట్‌లో విషయమేమీ లేదని విమర్శించారు. బడ్జెట్లో కొత్త రైళ్లు లేకపోవడం భారత చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు' అన్నారు. ఇదింతా ఊహాజనిత బడ్జెట్ గా ఖార్గే వ్యాఖ్యానించారు. బడ్జెట్ ఆసాంతం అలోచనలతో నిండి వుందని, అయితే అలోచనలు ఎలా అమలు చేస్తారన్నది మాత్రం వివరించలేదని చెప్పారు. బడ్జెట్ మొత్తం ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యం పద్దతిలో వుందని, ఎక్కడా ప్రజాహితం కనబడలేదని విమర్శించారు.
రైల్వే బడ్జెట్లోని అంశాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయిగాని ఆచరణ సాధ్యం కావని తృణమూల్ కాంగ్రెస్ నేత, కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది అన్నారు. రైల్వే పునాదులను ముందుగా బలోపేతం చేయాల్సిన అవసరం వుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రయాణికులకు అదనపు సౌకర్యాల కల్పన కన్నా ప్రస్తుతం వున్న సౌకర్యాలను కొనసాగిస్తూనే పునాదులను పటిష్టం చేయాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రైల్వేల నిర్వహణను ప్రస్తుత పద్దతిలోనే కొనసాగించాలని, అలా కాని పక్షంలో యావత్ దేశ సమగ్రతను ప్రశ్నిస్తుందన్నారు. రరైల్వేలను జీవనాడులని ఆయన సూచించారు. రైల్వే బడ్జెట్ ఎయిర్ ఇండియా మార్గంలో ప్రయాణించిందని ఎద్దేవా చేశారు. భాజపా ప్రభుత్వం గాలిలో మేడలు కడుతోందని విమర్శించారు. బుల్లెట్ రైలు మంచి ఆలోచన అన్న దినేష్ త్రివేది.. దాని నిర్వహణకు కిలోమీటరు మూడు వందల కోట్ల రూపాలను వెచ్చించాల్సి వుంటుందని, దానిని ఎవరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు.
కాగా, దేశంలోని అన్నిప్రాంతాలు, వర్గాలను సంతృప్తి పరిచేలా రైల్వేబడ్జెట్ రూపొందించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైలు కోసమేనన్న సూత్రం ఆధారంగా రైల్వేబడ్జెట్‌ను తయారు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రయాణికుడికి మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశామన్నారు. రైతుల సౌకర్యం కోసమూ కొన్ని చర్యలు తీసుకున్నామని, వృద్ధులు, వికలాంగుల కోసం స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా వికలాంగులు, అంధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రతిపాదించినట్లు వివరించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more