Nitin gadkari family france trip essar controversy

nitin gadkari news, nitin gadkari france trip, nitin gadkari essar trip, nitin gadkari essar news, nitin gadkari controversy, nitin gadkari trip controversy, nitin gadkari family trip news

nitin gadkari family france trip essar controversy : essar leaks the details of central minister nitin gadkari family trip when he was not an mp or any other position

కేంద్రమంత్రి గడ్కరీని చిక్కుల్లో పడేసిన ‘విహారయాత్ర’

Posted: 02/27/2015 06:26 PM IST
Nitin gadkari family france trip essar controversy

ప్రస్తుతం కేంద్రమంత్రిగా చెలామణి అవుతున్న గడ్కరీని ఓ ‘విహారయాత్ర’ చిక్కుల్లో పడేసింది. కుటుంబసభ్యులతో కలిసి కొంతసమయం హ్యాపీగా గడుపుదామని విహారయాత్రకు వెళ్లగా... అదే ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్యలు తెచ్చిపెడుతోంది.

అసలు విషయం ఏమిటంటే.. 2013 జూలైలో నితిన్ గడ్కరీ తన బార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి ఫ్రాన్స్ విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన పదవిలోనూ లేరు.. కనీసం ఎంపీ కూడా కాదు.. అయినప్పటికీ ఎస్సార్ యాజమాన్యం ఆయనను ఒక ముఖ్యమైన వ్యక్తిగా భావించి అన్ని సౌకర్యాలు కల్పించింది. ఆ కంపెనీకి చెందిన ఓ విలాసవంతమైన పడవలో గడ్కరీ తన కుటుంబసభ్యులతో రెండురోజులపాటు గడిపారు. తమకు కావలసిన అన్ని విలాసాలను విచ్చలవిడిగా అనుభవించారు. ఇందుకుగానూ ఎక్కువ డబ్బులు ఖర్చయ్యాయి కూడా!

ఈ నేపథ్యంలోనే ఆ యాత్రపై వివరాలు కోరుతూ నితిన్ గడ్కరీపై ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. ఏ హోదాలోనూ లేని ఆయన ఎస్సార్ కంపెనీ ఆతిథ్యం అందుకోవడమే కాకుండా భారీ ఖర్చు చేశారని అందులో పేర్కొనడం జరిగింది. అయితే.. తాను మాత్రం ఎలా తప్పూ చేయలేదని గడ్కరీ చెబుతూ వచ్చారు. కాగా.. ఆయన వెళ్లిన ఆ యాత్రకు సంబంధించి తాజాగా పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాల్లో ఆయనకు అనుభవించిన విలాసాలు, ఇతర వివరాలు పూర్తిగా బయటపడటంతో ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitin gadkari family trip controversy  essar ship  

Other Articles