Sreesanth indian cricketer singer madhu balakrishnan tv talk show

sreesanth news, sreesanth murder attempt, sreesanth latest news, sreesanth controversy, sreesanth cricket career, sreesanth history, sreesanth fixing scam, sreesanth fixing news, sreesanth teehar jail, singer madhu balakrishnan

sreesanth indian cricketer singer madhu balakrishnan tv talk show : Indian cricketer sreesanth's brother in law and singer madhu balakrishnan revealed a secret about sreesanth that when he is in jail a murderer attacked on him.

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై హత్యాయత్నం..!

Posted: 02/27/2015 06:22 PM IST
Sreesanth indian cricketer singer madhu balakrishnan tv talk show

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న క్రికెటర్ శ్రీశాంత్... హత్యాయత్నం జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదులెండి.. 2013 మే నెలలో స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో అరెస్టయి కొన్నిరోజులు తీహార్ జైల్లోనే వున్న విషయం విదితమే! ఆ సమయంలోనే అతనిపై హత్యాయత్నం జరిగిందని తెలిసింది. ఈ విషయాన్ని శ్రీశాంత్ బావమరిది, గాయకుడైన మధు బాలకృష్ణన్ వెల్లడించారు.

ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్న మధు.. శ్రీశాంత్ పై జరిగిన హత్యాయత్న విషయాలను తెలిపాడు. ఈ నేపథ్యంలోనే అతడు మాట్లాడుతూ.. ‘‘శ్రీశాంత్ తీహార్ జైల్లో వున్న సమయంలో ఓ హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో అతనిని చంపేందుకు ప్రయత్నించాడు. అయితే.. శ్రీ ఆ ఘటన నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అప్పుడే పోలీసులు వచ్చి శ్రీని కాపాడారు. కానీ.. ఆ ఘటన ఐపీఎల్ స్కామ్ కు సంబంధించే జరిగిందని చెప్పలేం’’ అని అన్నాడు.

అలాగే.. ‘‘శ్రీశాంత్ జైల్లో వున్నప్పుడు చాలా హింసకు గురయ్యాడు. తను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుందుకు తీవ్ర ఆవేదనతో కుమిలిపోతుండగా.. అక్కడున్న వాళ్లు ఇతడ్ని మాటల తూటాలతో మరింతగా బాధపెట్టేవారు’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు శ్రీపై పగ పెట్టుకున్నారని తెలిపిన మధు.. వాళ్లే కుట్రపన్ని ఇతనిపై నిందలు మోపి జట్టు నుంచి తొలిగించారన్న అభిప్రాయాన్ని వెల్లడించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sreesanth controversy  singer madhu balakrishnan  icc worldcup 2015  

Other Articles