వాట్సప్‌లో వచ్చిన గ్యాంగ్ రేప్ కు సంబందించిన వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ రాసిన లేఖను సుమోటో పిటిషన్‌గా సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆమె పెన్‌డ్రైవ్‌లో రెండు వీడియోలను పెట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుకు లేఖ రాశారు. ఫిర్యాదును, వీడియోలను పరిశీలించిన అనంతరం లైంగికదాడి ఘటన అమానుషం, అత్యంత భయంక రం అని కోర్టు వ్యాఖ్యానించింది. సామూహిక లైంగికదాడి ని సహించేది లేదని కోర్టు వెల్లడించింది. సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఆ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
ఈ వీడియో వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఐటీశాఖతోపాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ రాష్ర్టాలకు నోటీసులు జారీచేసింది. మార్చి 13వ తేదీన ఈ కేసు విచారణను ధర్మాసనం చేపట్టనున్నది. 4.5 నిమిషాల వ్యవధి ఉన్న వీడియోలో బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడతుండగా మరో యువకుడు చిత్రీకరిస్తున్నట్లు కనిపించింది. 8.5 నిమిషాల వ్యవధి ఉన్న మరో వీడియోలో బాలికపై ఐదుగురు యువకులు కెమెరాకు నవ్వుతూ పోజు ఇవ్వడం, జోకులు వేయడం, ఒక్కొక్కరు బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడుతున్న వ్యవహారాన్ని కెమెరాలో షూట్ చేయడం రికార్డు అయింది. ఈ వీడియోలు దేశవ్యాప్తంగా వాట్సప్ ద్వారా వేగంగా చేతులు మారింది. లైంగికదాడికి సంబంధించిన వీడియోలు తన దృష్టికి రావడంతో సునీతా కృష్ణన్ వెంటనే యూట్యూబ్‌లో ఇటీవల పోస్ట్ చేశారు. నేరస్థులను పట్టుకోవడం కోసం సహాయం అందించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదని సునీతా కృష్ణన్ అన్నారు. మొత్తానికి సుప్రీం కోర్టు జోక్యంతో ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more