ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జుట్ ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వం అని అన్నారు. సామాన్యుడికి మేలు చేసేలా తమ బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్రాల ప్రాధాన్యత గురించి వివరించారు. అన్ని రాష్ట్రాలకు అభివృద్దిలో భాగస్వామ్యం ఉందని, రాష్ట్రాలకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు. విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయని జైట్లీ తెలిపారు. దేశం ఎన్నో సవాళ్లను అధిగమించిందని అన్నారు. తమ చర్యల కారణంగా ద్రవ్యోల్బణం 5.1 కి తగ్గిందని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఇండియాను మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గా మారుస్తామని జైట్లీ తన ప్రసంగంలో వివరించారు. నిరంతర విద్యుత్ సాగు, తాగునీరు అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.పేదరిక నిర్మూలన ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్షమని, 2022 లోగా పేదరికాన్ని నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని అన్నారు. పెట్టుబడులకు భారత్ అనువైన దేశంగా మారిందని, ఇదంతా మోదీ ప్రభుత్వ ఘనత అని చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం పరుగులెత్తించిందని అన్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more