Green corridor in hyderabad live heart reached safely

a live heart being airlifted from bengaluru to hyderabad, green corridor in hyderabad, recipient for his heart, PMSSY Hospital, Green corridor, electronic city, brain dead, Sholapur in Maharashtra., organ donar, donates organs and heart, bengaluru PMSSY hospital, native of Sholapur, savior for four patients

A 30 year old man who met with an accident near Electronic city two days ago, is now a savior for four different patients.

కుయ్య్...కుయ్య్...కుయ్య్... లబ్ డబ్ లబ్ డబ్..

Posted: 02/28/2015 04:11 PM IST
Green corridor in hyderabad live heart reached safely

అప్పుడు బెంగళూరు....ఇప్పుడు హైదరాబాద్. కొన్ని నిమిషాల పాటు ఎక్కడి ట్రాఫిక్ అక్కడే జామ్. ఆ మార్గంలో ఒక్క వాహనం కూడా లేకుండా కట్టదిట్టమైన చర్యలు. మరోలా చెప్పాలంటే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఇంతకీ గ్రీన్ కారిడార్ అంటే ఏమిటీ అనుకుంటున్నారా..? గ్రీన్ కారిడార్ అంటే సజీవంగా ఓ ప్రాంతంలో వున్న అవయవాన్ని నిర్ధేశిత సమయంలోపు గమ్యస్థానానికి చేర్చడమే. ఇందుకు ఎవరూ అడ్డురాకుండా రోడ్డుమార్గంలో కొన్ని నిమిషాల పాటు అప్రకటిత కర్ఫ్యూను విధించడమే.

ఇప్పుడు హైదరాబాద్ లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకోచ్చింది అంటే.. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని ఓ మహిళకు అమర్చాల్సిన గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు గుండె సజీవంగా చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్సులో నేరుగా ఆస్పత్రికి గుండెను చేర్చారు. ఇందుకోసం ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా  ట్రాఫిక్ యంత్రాంగం గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంది. కేవలం మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.

యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 45 ఏళ్ల మహిళకు ఈ గుండెను అమర్చనున్నారు. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ గుండెమార్పిడి జరగనుంది. మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన దినసరి కూలి రెండు రోజుల క్రితం కర్ణాటకలో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ వద్ద రోడ్డు ప్రమాదానికి  గురయ్యాడు. దాంతో అతన్ని చికిత్స నిమిత్తం పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిలో చేర్చారు. అయితే రోగికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా  వైద్యులు ప్రకటించారు. దీనితో మృతుని బంధువులు అవయవదానానికి అంగీకరించారు. అంతే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గుండెను తరలించారు. కూలి కుటంబం పెద్ద హృదయంతో అవయవదానానికి అంగీకరించి నలుగురు జీవితాల్లో వెలుగులు అందించడంతో పాటు దానగుణంలో కుబేరులనిపించుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BENGALURU  Heart airlifted  Hyderabad  Yashoda Hosipital  

Other Articles