Annahazare footmarch on land acquisition bill

foot march, Land Acquisition Bill, Anna Hazare, Social activist, anna,

Social activist Anna Hazare has now announced a 1,100-km foot march – on the lines of the historic Dandi March by Mahatma Gandhi – to put pressure on the BJP government at the Centre to stay clear of amending Land Acquisition Act.

మరో ఉద్యమానికి అన్నా.. 1100కిలోమీటర్ల పాదయాత్రకు సిద్దం

Posted: 03/04/2015 08:40 AM IST
Annahazare footmarch on land acquisition bill

భూసేకరణ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీస్తు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రూపం దాల్చుతోంది. రామ్ లీలా మైదానంలో సభల ద్వారా తన గొంతును, తన నిరసనను తెలిపిన అన్నా ఇప్పుడు తాజాగా రోడ్డెక్కనున్నారు. అధికారపక్షం తీసుకుంటున్న నిర్ణయాల్లో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ప్రారంభించిన భూసేకరణ బిల్లుపై నిరసనలు అన్ని ప్రతిపక్ష పార్టీలకు వ్యాపించింది. దాంతో ప్రభుత్వాన్ని కట్టడి చేశాయి విపక్షాలు. ప్రభుత్వం భూసేకరణ చట్టంలో మార్పులకు అంగీకరించింది. అన్ని పక్షాలతో కలిసి చర్చించి, తుది రూపాన్ని తెద్దామని ప్రభుత్వం ప్రకటించింది.

భూసేకరణ చట్టంలో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులో రైతు వ్యతిరేక నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తున్న గాంధేయవాది అన్నా హజారే తాజాగా మరో చరిత్రాత్మక ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. బిల్లును మార్చాలని కోరు తూ మహారాష్ట్రలోని వార్ధా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి 1100 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. వార్ధాలో మహాత్మాగాంధీ నెలకొల్పిన సేవాగ్రాం నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానం వరకు మూడు నెలలపాటు సాగుతుందని చెప్పారు. ఈ నెల తొమ్మిదిన సేవాగ్రాంలో జరిగే సమావేశంలో యాత్ర ప్రారంభతేదీని నిర్ణయిస్తామని వెల్లడించారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇటీవలే ఆయన రాంలీలా మైదానంలో రెండురోజుల దీక్ష చేసినప్పటికీ నరేంద్రమోదీ సర్కారు స్పందించకపోవటంతో ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు ఈ యాత్ర చేపడుతున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : foot march  Land Acquisition Bill  Anna Hazare  Social activist  anna  

Other Articles