నిర్భయ హత్యకేసులో దోషిగా నిర్థారణ చెంది జైలుశిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ వివరాలు బయటకు రావడంపై యావత్ భారతావని స్పందించింది. ఎవరికీ తోచిన విధంగా వారు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. యువత సామాజిక మీడియాను అయుధంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండగా, సెలబ్రిటీలు కూడా వారికి అండగా నిలుస్తూ.. ఈ ఘటనలో దోషిగా తేలిన ముఖేష్ సింగ్ పై తగు విధంగా స్పందిస్తున్నారు.
సినీ సెలబ్రిటీలు ముఖేష్ సింగ్ తీరుపై దుమ్మెత్తి పోసారు. అతన్ని హత్య చేస్తానంటూ తాప్సీ వ్యాఖ్యానిస్తే....అతని ఇంటర్వ్యూ తీసుకోవడంపై రేణు దేశాయ్ మండి పడ్డారు. అత్యాచారానికి సహకరించని నిర్భయదే తప్పంటూ, ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు' అంటూ నిర్భయ ఘటనలో దోషైన ముఖేశ్ సింగ్ తాజాగా బీబీసీ ఇంటర్వ్యూపై వివాదం రాజుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భారత కూతురు' పేరుతో మార్చి 8న ఎన్డీటీవీలో రానున్న డాక్యుమెంటరీలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు.
ముఖేష్ ఇంటర్వ్యూ చదివాక ఒక్కసారిగా మాట పడిపోయింది. దేవుడా ఒక్క హత్య చేస్తాను నన్ను క్షమించు, వాడిని ఊరికే వదలకూడదు' అంటూ తాప్సీ తీవ్రంగా స్పందించింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా? అనే అనుమానం వస్తోంది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు? అని ప్రశ్నించింది. నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కూడా నిర్భయ దోషి ముఖేష్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. 'అత్యాచారంపై మీ అభిప్రాయం ఏమిటి? రేపిస్టు తన ఇంటర్వ్యూలో చెప్పిన అంశంతో మీలో ఎంతమంది రహస్యంగా ఏకీభవిస్తారు? అత్యాచారంలో నిజంగా మహిళల తప్పు ఉంటుందా?' అంటూ సూటిగా ప్రశ్నలు సంధించింది.
వెన్నెల కిషోర్ స్పందిస్తూ....‘రేపిస్టుకు కుర్చీవేసి కూర్చోబెట్టి.. ఇంటర్వ్యూ చేయడం నిజంగా నమ్మలేకపోతున్నానని, అతడు జైల్లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడి కంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకొంటున్నాడు' అంటూ ఫైర్ అయ్యారు. వీరే కాదు నిర్భయ ఘటన దోషితో ఇంటర్వ్యూ తీసుకుని అతన్ని హీరోగా మార్చడంపై యావత్ భారతావని మండిపడుతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more