తెలుగు నాట మరో కొత్త శకం మొదలు కానుంది. నిన్నటి వరకు కంపు కొడుతున్న రాజకీయాలతొ విసిగిపోయిన ప్రజలకు కొత్త ఆశ రేకెత్తుతోంది. మాటల్లో కాదు చేతల్లోనే చూపితానంటూ ప్రజల ముందు వస్తున్న జననేతకు ప్రజలు ఎప్పుడూ స్వాగతం పలుకుతారు. ఆకలితొ ఉన్న జనానికి అన్నం పెడితే ఎంత సంతోషపడతారో, ఇప్పుడు బురద రాజకీయాలను కడిగివెయ్యడానికి వచ్చే నాయకుడికి జనం బ్రహ్మరథం పడతారు. అలాంటి ఘటనే చరిత్రలో నమోదైంది. రాజీకాయాల్లోకి వచ్చేది పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ జనాల మెదడులో కొత్త స్పూర్తిని నింపుతూ వచ్చిన జనసేన పార్టీ, రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. తన పవర్ తో కొన్ని కోట్ల మందిని తన అభిమానులుగా మార్చుకున్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో తన పవర్ ను చూపించడానికి సిద్దమయ్యారు. అయితే అందరిలాగా పవర్ పాలిటిక్స్ మాత్రం ఆడటం లేదు, ప్రజల కొసం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రజల వద్దకు వచ్చాడు పవన్ కళ్యాణ్.
ఎన్నికల్లో సవాలక్ష వాగ్దానాలు చెయ్యడం, వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చెయ్యడం ఎప్పుడూ చరిత్రలో జరిగే అంశాలే. కానీ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే వారు కొంతమంది మాత్రమే. అయితే ఈ కొంత మందిలో పవన్ పేరు కూడా నిలుస్తుందని చాలా మంది నమ్మకం. మాటలు కాదు, చేతలు చూపిస్తానన్న పవన్ పై ఎంతో భరోసా ఉంచారు ప్రజలు. పార్టీ ఆవిర్భావ సభ నుండి మిగిలిన రాజకీయ పక్షాలకు భిన్నంగా వ్యవహరించిన జనసేన పార్టీ, తన కార్యాచరణను ఇప్పుడు ప్రారంభించింది. ఓ పనిని ప్రారంభించి, దాన్ని మధ్యలో వదలక పోరాడతారు ధీరులు అన్న వేమన మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుంటా అని పెద్దగా మాటలు కూడా చెప్పలేదు. కానీ నాయకుడు అనే వాడు కష్టనష్టాల్లో ముందుండి నడిపిస్తాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ నిదర్శనంగా నిలుస్తున్నారు. రాజధాని గ్రామాలకు చెందిన ప్రజలు తమ భూములు పోతున్నాయి, మా బతుకు ఆధారాన్ని కోల్పోతున్నాం అన్న మాటలకు పవన్ స్పందించారు. నాయకుడు అనే వాడు అన్నింటా ముందుండాలి అందుకే పవన్ రైతుల ముందుకు వచ్చాడు, ప్రజల మధ్యకు వచ్చాడు.
మీ అన్నగారు అలా చేశారు మరి మీరు ఎలా చేస్తారో అన్న ఎత్తిపొడుపు మాటలకు కుంగడానికి అతను మామూలు వ్యక్తి కాదు, మహా శిఖరం. అందుకే తాను అనుకున్న దానికి ఎవరు ఎలా అడ్డువచ్చినా లెక్కచేయక ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. నేను స్వచ్ఛమైన మనసుతో మీ ముందుకు వస్తున్నాను, మీ ఆశిర్వాదం ఉంటే చాలు నాకు మరింకేం అక్కర్లేదు అన్న మాటలకు తెలుగు ప్రజలు పొంగిపోయారు. పెదవి విరిచే వారె విరుస్తూనే ఉంటారు కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే వారు మాత్రమే నాయకుడిగా నిలుస్తారు, విజయాన్ని సాధిస్తారు. అలా పార్టీ ఆవిర్భావం నుండి ఆరోపణలు వచ్చినా, వాటిని తిప్పి కొడుతూ ముందుకు దూసుకుపోయారు పవన్.
ఎన్నికల సమయానికి ఎలాగోలా అభ్యర్థులను నిలిపి, హడావిడి చేసే పార్టీలు దేశంలో చాలానే ఉన్నాయి, భవిష్యత్తులోనూ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం వాటికి భిన్నం. ఎన్నికల సమయంలో అవకాశం ఉన్నా, పోటీకి దూరంగా ఉండి, ఎన్నికల ప్రచారంలో జనాల దగ్గరకు చేరారు ఆయన. అలా ముందుకు భిన్నంగా, భవిష్యత్తుకు మార్గంగా నిలిచారు. అలా చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశారు. ఎన్నికల సమయంలో మోదీతో ఎంతో సానిహిత్యాన్ని కలిగారు. మోదీ కూడా తెలుగు ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు ఆశ్చర్యపోయారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సభ పెట్టినా, ప్రత్యేకంగా వపన్ కు ఫోన్ చేసే వారు.
ఎన్నికలు ముగిసాయి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. రాజధాని కూడా లేని ఏపి కొత్త రాజధాని నిర్మాణానికి పనులను ప్రారంభించింది. అందులో భాగంగా రైతుల నుండి భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ భూములను వదులుకోవడానికి సిద్దంగా లేరు. తాము భూమి మీద పడి బతుకుతున్నామని, భూమిని లాక్కుంటే ఏం మిగులుతుందని వారు విచారంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలని పట్టపట్టింది. అందులో భాగంగా 33వేల ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉంది. భూమి అంటే మట్టి కాదు, తమకు బ్రతుకునిచ్చే తల్లి అన్న రైతుల గోడును పట్టించుకునే వారే లేకుండా పోయారు. అయితే రైతుల గోడును వినడానికి, వారి బాధలను కలిసి పంచుకోవడానికి ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్.
రాజధాని నిర్మాణం కోసం భూమిని సేకరిస్తున్న గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభించారు. ప్రజల్లోకి వచ్చిన పవన్ కు ఘన స్వాగతం లభించింది. చిన్నా,పెద్దా, ఆడ, మగ, ముసలి, ముతక ఇలా భేదాలు లేకుండా అందరూ పవన్ రాకను స్వాగతించారు. తమ కొత్త నాయకుడిని చూడడానికి, మాట్లాడడానికి చాలా మంది అభిమానులు ఎగబడ్డారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లే్కుండా, మందీ మార్భలం లేకుండా, మందు, డబ్బు లేకుండా పవన్ చేపట్టిన యాత్ర చరిత్రలో నిలుస్తుంది. పలానా పార్టీ అంటేనే వారు ఇంత మందిని పోగేస్తారు అని తెలుగు ప్రజల గుండెల్లో ఉంది. అయితే నిజమైన నాయకుడు వస్తే ఖచ్చితంగా అందరు కలిసి నాయకుడి వెంట నడుస్తారన్నది నిజం. అదే మరోసారి నిరూపించడం జరిగింది. రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగాపాల్గొన్నారు.
ప్రజా జీవితాలను మార్చడానికి, ప్రజల మధ్యకు చేరిన పవన్ కు అనుకోని రీతిలో ఘన స్వాగతం లభించింది. స్వాగత తోరణాలు లేవు, భాజా భజంత్రీలు లేవు, నోటుకు నినాదాలు చేసే భజన బృందం కూడా లేదు. అయినా పవన్ పర్యటన విజయం సాధించింది. ఎందుకంటే నాయకుడి వెంట నడిచేందుకు ప్రజలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అందుకే పవన్ పర్యటనలో తండోపతండాలుగా తరలివచ్చిన జనం, పవన్ మాటలు, ప్రవర్తనకు ముగ్దులయ్యారు. హడావిడితో ప్రజలను మాయ చేసే నాయకులకు, ఎలాంటి దర్పంలేకుండా వచ్చిన పవన్ ను కూడా ఆశ్చర్యపోయారు. వపన్ మాటలకు ప్రజలు మంత్రముగ్దులయ్యారు. తమలాగే ఆలోచించే నాయకుడు దొరికాడు అని వారు ఆనందంతో ఊగుతున్నారు. తమ కష్టాలను తీర్చే వారేమో, కనీసం వినే వారు కూడా లేరని బాధ పడే ప్రజలకు పవన్ వేగుచుక్కలా కనిపించారు. కొత్త ఉదయానికి నేనే నాంది అన్న కవితా దృక్పథాన్ని కంటికి చూపారు.
భూముల సేకరణలో రైతులకు అన్యాయం జరగకూడదని, తాను కూడా రైతునే అన్న మాటలు రైతుల హృదయాలను స్పర్శించాయి. రైతుల కష్టాలను వినడానికి తాను కూడా నేల మీద కూర్చున్న ఆ నాయకున్ని చూడడానికి జనాలు విరగబడ్డారు. ఎప్పుడూ ఎండ కూడా చూడడేమో అనుకున్న నాయకుడు ఇలా తమ కోసం నేల మీద కూర్చొని, వారి సమస్యలను వినడం వారికి కొత్త అనుభూతిని మిగిల్చింది. తమ తరఫున మాట్లాడే కొత్త గొంతుకు వారు పులకించారు. ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన టిడిపిని వదల్లేదు. న్యాయం కోసం ఎవరినైనా ఎదురించాలన్న స్పూర్తిని పవన్ ప్రదర్శించారు. జగన్ కళ్లబొల్లి మాటలను తిప్పికొట్టారు. అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇప్పిస్తానని చెప్పిన జగన్ కు తాను భిన్నం అని అన్నారు. తాను మిగిలిన వారిలా కాదని, హామీలు ఇవ్వడానికి రాలేదని, మీ సమస్యను తీర్చడానికి ఇక్కడకు వచ్చానని చెప్పినపుడు రైతుల కళ్లలో ఆనందం తొనికిసలాండి. ఈ ఉదయం నిజంగా నవ ఉదయం అని అందరూ అనుకునేలా సాగింది పవన్ యాత్ర. తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు అందరం సాదర స్వాగతం పలుకుదాం.
-అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more