Pawan kalyan satires ys jagan mohan reddy ap capital issue

pawan kalyan news, ys jagan mohan reddy, ap capital city issue, chandrababu naidu, andhra pradesh land pooling, ap capital land pooling, ysr congress party news, janasena party news, tdp party news, ysrcp ministers, janasena party members, tdp party ministers

pawan kalyan satires ys jagan mohan reddy ap capital issue : Janasena party president power star pawan kalyan makes satirical comments on ys jagan mohan reddy.

జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్..

Posted: 03/05/2015 04:22 PM IST
Pawan kalyan satires ys jagan mohan reddy ap capital issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై గతకొన్నాళ్ల నుంచి రేగుతున్న వివాదాల నేపథ్యంలో ఇటీవలే వైకాపా అధినేత రాజధాని గ్రామాల్లో పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. అయితే.. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా పవన్ కల్యాణ్ సెటైరిక్ గా తనదైన వాదనను వినిపించారు.

ప్రస్తుతం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న పవర్ కల్యాణ్.. జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. రాజకీయ లబ్ది కోసం తాను రాలేదని, ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే భూములు ఇస్తానని తాను చెప్పడం లేదని, కేవలం రైతులకు న్యాయం చేయడం కోసం తాను వచ్చానని పవన్ పేర్కొన్నారు. ఐదేళ్ల తర్వాత న్యాయం చేస్తానని తాను కబుర్లు చెప్పడం లేదని, ఈ క్షణం నుంచే తాను రైతుల తరఫున పోరాటం చేస్తానని అన్నారు.

అంతేకాదు.. గత వైఎస్ హయాంలోను జరిగిన అన్యాయాలపై పవన్ విరుచుకుపడ్డారు. వైఎస్ హయాంలో వాన్ పిక్ కోసం వేలాది ఎకరాల భూమిని లాక్కున్నారని, కానీ అందులో ఒక ఎకరం భూమిని కూడా వినియోగించలేదని పవన్ విమర్శించారు. ఇలాంటి ఘోరాలు వైఎస్ హయాంలో ఇంకా ఎన్నో జరిగాయని ఆయన అన్నారు.

అలాగే.. కేవలం వైకాపాకు చెందిన గ్రామాలవారే భూసేకరణను వ్యతిరేకిస్తున్నారని కొంతమంది మంత్రులు తనతో అన్నారని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే.. రైతులు ఏ పార్టీకి చెందినవారన్నది తనకు ముఖ్యం కాదని, వారికి న్యాయం జరగాలన్నదే తనకు ప్రధానమని పవన్ స్పస్టంగా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles