Major snowstorm blankets us from texas to new england

Major snowstorm blankets US, snow storm affected Texas to New England, Snow was falling from northern Texas to Connecticut, busiest travel corridors hit by snowstorm, Washington DC to New York City, south-east storm’s effects, Kentucky, Radcliff, Scioto County in Ohio, snowiest March days ever in Dallas, plane slid off the runway in newyork, plane struck a fence before coming to rest, 127 passengers and 5 crew members were injured, New York's LaGuardia Airport

Snow was falling from northern Texas to Connecticut, as a storm system expected to badly affect travel stretched from northern Mexico to New England.

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను..

Posted: 03/07/2015 05:30 PM IST
Major snowstorm blankets us from texas to new england

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర టెక్సాస్ నుంచి కనెక్టికట్ వరకు తుఫాను తన ప్రభావాన్ని చాటుకుంది. మంచు తుఫాను ధాటికి అమెరికాలో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంబించింది. ముఖ్యంగా ఉత్తర మెక్సికో నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు మంచు తుఫాను కారణంగా రవాణ వ్యవస్థ స్థంభించింది. వాషింగ్టన్ డిసి నుండి న్యూయార్క్ వరకు గల అన్ని వాణిజ్య ప్రాంతాలపై తుఫాను ప్రభావం పడింది. దీంతో అనేక చోట్ల వాణిజ్యపట్టణాల్లో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డారు.

తూర్పు మధ్య అమెరికాలో మంచు తుపాను ప్రభావం పడింది. కాగా అగ్నేయ అమెరికాలో తుపానుతో పాటు రాత్రంతా వర్షం కూడా కురిసింది. ముఖ్యంగా కెంటుకీ ప్రాంతలో పాటు రాడ్క్లిప్ ప్రాంతంలో 16 ఇంచుల వర్షపాత నమోదందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఓహియోలోని స్కోడియో కౌంటీ కూడా తీవ్రంగా కురిసిన మంచు 11 ఇంచుల మేర పేరుకుపోయింది. డల్లాస్ లో ఆరు ఇంచుల మేర మంచు కురువగా, మధ్య టెక్సాస్ తో పాటు ఈశాన్య టెక్సాస్ లో కూడా మంచు తుఫాను తన ప్రభావాన్ని చాటుకుందని అధికారులు వెల్లడించారు.

తీవ్రంగా కురిసిన మంచు కారణంగా న్యూయార్క్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. నేపాల్ లోని ఇటీవల టర్కీస్ విమానానికి ఎదురైన దుస్థితే ఈ విమానానికి ఎదురైంది. లగార్డియా విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా ఓ విమానం జారిపోయి.. ముందుకు వెళ్లి కంచెను ఢీ కోనింది. అట్లాంటా నుంచి వచ్చిన ఆ విమానం రన్‌వేపై దిగుతుండగా ఈ ఘటన జరిగింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా అది రన్‌వేపై జారిపోయింది. విమానంలో వున్న 127 మంది  ప్రయాణికులతో పాటు 5 గురు విమాన సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అందరినీ ఎమర్జెన్సీ ద్వారం నుంచి ఎయిర్ పోర్టు టర్నినల్ కు తరలించారు.వాషింగ్టన్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snowstorm blankets US  New York's LaGuardia Airport  delta airlines plane  

Other Articles