Telangana government focuses on power crisis

eetala rajender tables first year long budget, Eetala first year long budget, telangana budget 2015-16, Telangana finance minister eetala rajender, telangana budget, Telangana Assembly,

Telangana government focuses on power crisis

2018 నాటికి మిగులు విద్యుత్ దిశగా తెలంగాణ..!

Posted: 03/11/2015 11:55 AM IST
Telangana government focuses on power crisis

మేకిన్ ఇండియా, మేడిన్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసనసభలో ఈటెల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యుత్ రంగానికి రూ.7,400 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2018 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తు తరానికి విద్యుత్ కోత అంటే ఏమిటో తెలియకూడదని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని ఆయన తెలిపారు.

2015-16 సంవత్సరానికి గానూ విద్యుత్ రంగానికి బడ్జెట్లో రూ.7,400కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,320 మెగావాట్లు ఉండగా, 2018 నాటికి 23,675 మెగావాట్లు ఉత్పత్తిని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ద్వారా 6వేల మెగావాట్లు, సింగరేణి కాలరీస్ ద్వారా 2వేల మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఏర్పాటు సామర్థ్యం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈపీసీ ప్రాతిపదికన 6వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ జెన్‌కో, బీహెచ్ఈఎల్ సంస్థల మధ్య జీ టూ జీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికైన 'వాటర్ గ్రిడ్' పథకానికి 2015-16 బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.4 వేల కోట్లను కేటాయించారు. మంచినీటిని మారుమూల గ్రామాలకు, నిర్లక్ష్యానికి గురైన తండాలకు జలప్రవాహంగా అందించడానికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రూపొందిచినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఈటెల తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకుంటే మళ్లీ ఓటు కూడా అడగమని సీఎం కేసీఆర్ సాహసోపేతంగా ప్రకటించారని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి విశేష ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తాజా బడ్జెట్‌లో రూ.11,216కోట్లు కేటాయించారు. అటు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగులు, విద్యార్థులకు బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఉద్యమంలో ప్రాధానపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీ రూ.238 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.22,889 కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. అంగన్వాడీ సిబ్బందికి ఈటెల తీపి కబురు అందించారు. వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.7 వేలు, కార్యకర్తలకు రూ.4 వేలు వేతనం ఇవ్వనుట్టు తెలిపారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెయ్యి వన్టైమ్ గ్రాంట్ మంజూరు చేస్తామని ఈటెల ప్రకటించారు. బడ్జెట్ అనంతరం స్పీకర్ మదుసూధనా చారి సభను వాయిదా వేశారు.


బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

* విద్యుత్ రంగానికి రూ.7,400 కోట్లు
* పారిశ్రామిక అభివృద్ధికి రూ.973 కోట్లు
* ఆసరా పింఛన్లకు రూ.4 వేల కోట్లు
* హరితహారానికి రూ.325కోట్లు
* వైద్య, ఆరోగ్యశాఖకు రూ.4,932కోట్లు
* జలహారానికి రూ.4వేల కోట్లు
* రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసికి రూ. 400 కోట్ల
* ఫ్లై ఓవర్లకు నిర్మాణానికి రూ.1600 కోట్లు
* రహదారుల అభివృద్ధి కోసం రూ.2,421 కోట్లు
* అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.7 వేలు
* కార్యకర్తలకు రూ.4 వేలు వేతనం
* ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెయ్యి వన్టైమ్ గ్రాంట్ మంజూరు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eetala rajender  budget 2015-16  Telangana Assembly  

Other Articles