సౌరశక్తితో నడిచే మొదటి విమానం సోలార్ ఇంపల్స్-2 భారత్ చేరింది. పూర్తి స్థాయి సౌరశక్తినే ఇంధనంగా వాడుకుంటూ ఈ విమానం ప్రపంచాన్ని చుట్టరానుంది. ప్రపంచ మొత్తం తిరిగిన మొదటి సోలార్ విమానంగా సోలార్ ఇంపల్స్-2 చరిత్ర కెక్కనుంది. మన్కట్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఈ విమానం అరేబియా సముద్రాన్ని దాటి గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ప్రపంచాన్ని చుట్టి వస్తున్న ఈ విమానానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. సోలార్ ఇంపల్స్-2 సాధారణంగా 45 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. అయితే సూర్యరశ్మి ఎక్కువైతే మరింత వేగంగా ప్రయాణిస్తుందని తయారీదారులు అంటున్నారు.
సోలార్ ఇంపల్స్-2 ఒక చుక్క కూడా మామూలు ఇంధనాన్ని వాడకుండా ప్రపంచాన్ని చుట్ట రానుంది. 2300 కిలోల ఈ విమానం 17,000 సోలార్ సెల్స్ అమర్చారు. మొత్తం 35,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని 12 సార్లు హాల్ట్ చెయ్యనుంది. మొత్తానికి భారతదేశంలొ రెండు చోట్ల సోలార్ ఇంపల్స్-2 కనువిందు చెయ్యనుంది. అహ్మదాబాద్ లో, వారనాసిలో కొంత సేదతీరనుంది. అహ్మదాబాద్ లో రెండు రోజుల పాటు ఉండి, సోలార్ పవర్ గురించి కొంత అవగాహన కల్పించనుంది. మరి ఇన్ని విశేషాలు ఉన్న ఈ సోలార్ ఇంపల్స్-2 ను చూడాలంటే వెంటనే అహ్మదాబాద్ బయలుదేరండి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more