Justice markhandeya katju sentences contraversial issues at nation

markhandeya katju, khatju, contraversial, justice, gandhi, netaji, kiran bedi, agent

justice markhandeya katju sentences contraversial issues at nation. katju attacks on gandhi, that gandhi is a british agent, andalso attacked on netaji subhashchandrabose that he is a japanese agent.

వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువు కట్జూ

Posted: 03/11/2015 01:14 PM IST
Justice markhandeya katju sentences contraversial issues at nation

మార్ఖండేయ కట్జూ.. బారత ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలందించిన గొప్ప వ్యక్తి. ఇది ఒక కోణం మాత్రమే కానీ అతని మాటలు, రాతలు దేశంలోనే సంచలనంగా మారతాయి. అతను ఏం రాసినా దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. తన మాటలను, రాతలను అక్షరాల వాస్తవాలు అని వాదిస్తుంటారు ఆయన. తాజాగా గాంధీ బ్రిటిష్ ఏజెంట్ అన్న ఆయన అంతకు ముందు కూడా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతాజీ జపనీస్ ఏజెంట్ అని, భారతదేశానికి నిజమైన జాతిపిత అక్బర్ అంటూ ఇలా అన్ని వ్యాఖ్యలు దేశ ప్రజలకు కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. ఢిల్లీ ఎన్నికల్లో కిరణ్ బేడి కన్నా,షాజియా ఇల్మీ అందంగా ఉంటుందని కామెంట్ చేశారు. ఇలా అన్నింటా వివాదాలకు తావిచ్చే వ్యాఖ్యలు చెయ్యడం మార్ఖండేయ కట్జూ స్పెషాలిటి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తి జాతి గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చెయ్యడం ఏంటని ఎవ్వరు ఎంత మండిపడ్డా వాటిని ఆయన అస్సలు లెక్క చెయ్యరు.

katju-tweet

తాజాగా గాంధీని విమర్శించేలా, గాంధీ బ్రిటిష్ ఏజెంట్, గాంధీ కూడా బ్రిటిష్ వారి విభజించు పాలించు సిద్దాంతాన్నిపాటించారని, హిందు మతతత్వం ఉట్టిపడేలా జాతీయ ఉద్యమంలో పాత్ర పోషించారని వ్యాఖ్యానాలు చేశారు. అయితే మార్ఖండేయ కట్జూ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. కట్జూ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో కూడా దుమారం రేగింది. రాజ్యసభలో కట్జూ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తు, ఓ మోషన్ ను తీసుకు వచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా కట్జూ వ్యాఖ్యలను ఖండించారు. అయితే కొందరు మాత్రం అతని మాటల్లో వాస్తవాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి కట్జూ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న వారు మాత్రం భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చెయ్యకూడదని కోరుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : markhandeya katju  khatju  contraversial  justice  gandhi  netaji  kiran bedi  agent  

Other Articles