In a helicopter crash olympic stars died

Helicopter Crash, realty show, france, tf1, channel, franchois haland, amirkhan

A group of French sports stars participating in the reality TV show Dropped have been killed when their two helicopters collided in midair while filming in Argentina, local officials confirm to the AFP.

క్రీడాకారులను కోల్పోయిన ఫ్రాన్స్

Posted: 03/11/2015 02:51 PM IST
In a helicopter crash olympic stars died

ఫ్రాన్స్‌ ఒకే రోజు ముగ్గురు స్టార్‌ క్రీడాకారులను కోల్పోయింది. ఓ రియాలిటీ షో చిత్రీకరణ సమయంలో రెండు హెలికాప్టర్‌లు ఢకొీట్టుకోవడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు క్రీడాకారులతో పాటూ మరో 7 మంది మరణించారు. క్రీడాకారులలో ఒలంపిక్‌ పతక విజేతలు కమిలె ముఫ్పత్‌, అలెక్సిస్‌ వస్తిన్‌లతో పాటూ లెజెండరీ సెయిలర్‌ ఫ్లోరెన్స్‌ ఆర్థౌడ్‌లున్నారు. మిగిలిన ఏడుగురిలో ఐదుగురు ఫ్రాన్స్‌ వాసులతో పాటూ ఇద్దరు పైలట్లున్నారు. అర్జెంటీనా రాజధాని బుయోనోస్‌ ఎయిరెస్‌కు దాదాపు 1200 కి.మీ దూరంలోని విల్లా క్యాస్టెల్లి వద్ద ప్రమాదం జరిగింది. టీఎఫ్‌1 అనే ఫ్రాన్స్‌ ఛానెల్‌కు సంబంధించిన రియాలిటీ షో చిత్రీకరిస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 'డ్రాప్‌డ్‌' అనే ఈ రియాలిటో షోలో సెలెబ్రిటీలను కొండల్లో కోనల్లో వదిలిపెట్టి తిండి సంపాదించడం కోసం వారు పడే కష్టాలను చిత్రీకరిస్తారు.

షోలో భాగంగా ఆటగాళ్లను, ప్రొడక్షన్‌ టీమ్‌ను తీసుకుని వెళ్లాల్సిన రెండు హెలికాప్టర్‌లు టేక్‌ఆఫ్‌ అయిన కాసేపటికే ఒకదానికొకటి ఢికొట్టుకోవడంతో ఘోరం జరిగింది. అయితే ప్రమాదం వెనక కారణాలు తెలియరాలేదు. ఒకే రోజు ముగ్గురు స్టార్‌ క్రీడాకారులు కోల్పోవ డంతో ఫ్రాన్స్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. క్రీడాకారులు, ఫ్రాన్స్‌ వాసుల మృతికి ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలండ్‌, ప్రధాన మంత్రి మాన్యు వెల్‌ వాల్స్‌లు సంతాపం ప్రకటించారు. మరోవైపు ఇంతమందిని పొట్టనబెట్టుకున్న రియాలిటి షో నిర్వహిస్తున్న ఛానెల్‌పై విమర్శకులు దాడి ప్రారంభించారు. ' ఇలాంటి రియాలిటీ షోలు పనికిరాని స్టార్లకు ఉపయోగపడతాయి కానీ క్రీడాకారులను మాత్రం బలిగొంటాయని ప్రముఖ మ్యుజిషియన్‌ బెంజమిన్‌ బయోలీ అన్నారు.

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఘటనపై స్పందించారు. మరణించిన క్రీడాకారులకు నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు తన ప్రఘాడ సానుభూతిని ప్రకటించారు. అయితే ఘటనకు సంబందించి దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. ప్రత్యేక బృందాల సహాయంతో మరింత సమాచారాన్ని సేకరిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్ ప్రకటించారు. క్రీడా ప్రపంచం ఈ ఘటనతో దిగ్ర్భాంతికి గురైంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Helicopter Crash  realty show  france  tf1  channel  franchois haland  amirkhan  

Other Articles