Aap convenor tried to break congress for getting chance to rule delhi

aap, kejriwal, audiotape, anjali damania, twitter, aamadmiparty, congress, ajay maken, sisodia, rajiv,

As the Aam Aadmi Party battles internal dissent, an old audio tape purportedly showing the party's national convener and Delhi Chief Minister Arvind Kejriwal discussing his plans to break the Congress and buy its MLAs last year during the President's Rule in Delhi surfaced on Wednesday. The AAP dismissed the audio, saying it was an attempt to defame the party.

కాంగ్రెస్ లో చీలికలకు కేజ్రీవాల్ ప్రయత్నం..!

Posted: 03/12/2015 08:45 AM IST
Aap convenor tried to break congress for getting chance to rule delhi

అధికారం కోసం ఆప్ చేసిన రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆప్‌ గత కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆప్‌ మాజీ ఎమ్మెల్యే రాజేష్‌ గార్గ్‌, మహారాష్ట్రకు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత అంజలి దమానియా ఢిల్లి ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది కేజ్రీవాల్‌ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలచేత కొత్త పార్టీని ఏర్పాటుకు ప్రయత్నించారు. ఆ పార్టీ ద్వారా ఆప్‌ ప్రభుత్వానికి మద్దతు పొందేందుకు ప్రయత్నించారని తాజాగా బయటపడింది 2014 జూలై-ఆగస్టు మధ్య రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న కాలంలో ఈ సంఘటన జరిగిందని అంజలి దమానియా  తెలిపారు. అప్పట్లో కేజ్రీవాల్‌ మళ్లి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. ఈ విషయంలో కేజ్రీవాల్‌ తనతో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేప్‌ ఒకటి బయటపెట్టారు.

మహారాష్ట్రకు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత అంజలి దమానియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను అరవింద్‌ కేజ్రీవాల్‌కు సిద్ధాంతాల కోసం మద్దతునిచ్చానని, బేరసారాల కోసం కాదని తెలిపారు. ఆమె తన ట్విటర్‌ ఖాతాలో తాను బయటకొచ్చేశానని, ఈ నాన్‌సెన్స్‌ కోసం రాలేదని అన్నారు. దీనిపై ఆప్ నేత ప్రీతి శర్మ స్పందిస్తూ ఇటువంటి టేపులు కొత్తవి కాదన్నారు, పార్టీ పరువు తీసేందుకు గతంలో కూడా ఇటువంటివాటిని విడుదల చేశారన్నారు.

aap-tweet

అంజలి దమానియా విడుదల చేసిన ఆడియో టేప్ లో ఉన్న సంభాషణ..

కేజ్రీవాల్‌ : ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మనీష్‌ సిసోడియా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారు, కానీ వారు ఆప్ కు మద్దతివ్వడానికి సిద్దంగా లేరు.
గార్గ్‌ : మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలూ ఆప్ కు మద్దతిచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు కానీ అజయ్‌ మాకెన్‌, రణదీప్‌ సుర్జీవాలా, మరో ఒకరిద్దరు అడ్డుతగులుతున్నారు.
కేజ్రీవాల్‌ : మాకెన్‌ సృష్టిస్తున్న సమస్యల వల్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
గార్గ్‌ : మనం వేగంగా కదలాలి. లేకపోతే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శాసనసభను రద్దు చేయవచ్చు. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మన మీద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్టింగ్‌ ఆపరేషన్‌ చేయకుండా చూసుకోవాలి.
కేజ్రీవాల్‌ : మీరు చేయవలసిందేమిటంటే కాంగ్రెస్‌ను చీల్చాలి, ఆరుగురు ఎమ్మెల్యేల చేత కొత్త పార్టీ పెట్టించి, వారు బయటి నుంచి ఆప్ కు మద్దతిచ్చేలా చేయాలి. మనం నెలన్నర నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోలేకపోతున్నాం.
కేజ్రీవాల్‌ : ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలనుకుంటున్నారు. కానీ అలా చేయలేరు ఎందుకంటే వారిలో ముగ్గురు ముస్లింలు. మనం వారిని ఆప్ కు మద్దతిచ్చేలా చేసుకోవాలి.
గార్గ్‌ : ఓకే, ఇది ప్రారంభమయ్యేలా చూస్తాను.

ఈ ఆడియో టేప్ లో అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా కాంగ్రెస్ ను చీల్చి, అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నించినట్లు కనిపించింది. రెండో సారి అధికార పగ్గాల కోసం ఆప్ కూడా రాజకీయాలకు దిగిందంటూ దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. మరి నిన్నటి దాకా కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు మాత్రమే వివాదాలకు కారణమైతే, ఇప్పుడు వివాదాలు మరింత పెరుగుతున్నాయి. మరి ఆప్ వీటన్నింటిని తట్టుకొని ఎలా నిలుస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  audiotape  anjali damania  twitter  aamadmiparty  congress  ajay maken  sisodia  rajiv  

Other Articles