Pawankalyans janasena party celebrating first anniversery

pawankalyan, janasena, pawan, first anniversary, party establish, landpooling, telugu states, capital, farmers

Jana Sena, the common man's biggest hope for alternative politics in the Telugu states, is celebrating its first anniversary today. Last year on this date(14th March 2014), the party's leader and the numero uno star of Telugu Cinema, Powerstar Pawan Kalyan launched the Jana Sena Party in Hyderabad amidst loud cheers and high hopes of millions of his fans and common people. Many hoped that Pawan's entry to active politics will change the face of political system and pave way to a responsible leadership.

ప్రత్యేకం: జనం కోసం జనసేన - అప్పుడే ఏడాది

Posted: 03/14/2015 04:40 PM IST
Pawankalyans janasena party celebrating first anniversery

రాజకీయ నాయకులని చూసి కోపం వచ్చి ఈ పార్టీ పెట్టాను , మతాల కోసం చచ్చిపోయేవాళ్ళని  చూసుంటారు , ప్రాంతం కోసం చచ్చిపోయేవాళ్ళని చూసివుంటారు , కులం కోసం చచ్చిపోయేవాళ్ళని చూసివుంటారు కానీ దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే- ఇవి సినిమా డైలాగులు కాదు, ప్రజల మధ్య నుండి పుట్టుకొచ్చిన ఓ కొత్త నాయకుడి మాటల సత్యాలు. ప్రాణం కన్నా దేశం మిన్న అన్న స్పూర్తిని నింపే ఆవేశ కణాలు. పవర్ కోసం కాదు ప్రశ్నించడానికి ప్రజల ముందుకు వస్తున్నా అంటూ తెలుగు ప్రజల వెలుగుదాతగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ జనసేనను స్థాపించేపుడు ఆవేశంతో అన్న మాటలు. కానీ అవి ఆవేశంతో అన్న మాటలు అనే కన్నా ఆలోచనాత్మకం అని అనడం కరక్టేమో. జనసేన పార్టీని స్థాపించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం...

నా వెనకాల ఎవరూ లేరు. నేను ఒక్కడినే, నా అభిమానులే నా సైన్యం అని తన పార్టీ స్థాపించిన రోజే పవన్ కళ్యాణ్ తెలిపారు. అభిమానులు అండగా ఉన్నారు కాబట్టే.. నేను ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తున్నని అంటూ 2014 మార్చి 14న హైదరాబాద్ నోవాటెల్ లో రాజకీయ ప్రస్థానానికి ప్రారంభం పలికారు పవన్. ఎంతో అంతర్మధనం చేసిన తరువాతే తాను జనసేనను స్ధాపించాలని నిర్ణయించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెండు దశాబ్ధాల వేదన తరువాత తాను ప్రజలకు, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయని అన్నారు. ఈ నిర్ణయానికి కట్టుబడి అన్నీ కోల్పోవడానికి తాను సిద్ధపడ్డానని చెప్పారు.

పార్టీ ఆవిర్భావ సందర్భంగా మాట్లాడిన మాటలు తెలుగు ప్రజల హృదయాలను కదిలించాయి. వపన్ మాటల్లో ఉన్న ఆతృతను ప్రజలు సాదరంగా స్వాగతించారు. సామాన్యుల కోసం పోరాటం చేసేందుకు తాను స్ధాపించిన జనసేన పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మహిళల రక్షణ కోసం పాటుపడే సమాజాన్ని స్థాపిస్తామని అన్నారు. సామాన్యులకు అందుబాటులో వైద్యం ఉండేలా చూస్తామని చెప్పారు. వారసత్వ రాజకీయాలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. నైతిక విలువలు, దేశ సమగ్రతను కాపాడే దృఢ నిశ్చయం ఉన్నవారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సఛ్చీలులనే పార్టీలో చేర్చుకుంటామని అన్నారు. నైతికంగా బలంగా ఉండే యువ నాయకుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తాను వేలకోట్లు సంపాదించుకోవాలని, పత్రికలు, ఛానళ్లు స్ధాపించాలని రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ప్రజా ధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోనని అన్నారు.

దేశ సమగ్రతను కాపడేందుకు తాను ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజం కోసం ప్రశ్నించేందుకు తాను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని చెప్పారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారి తాట తీస్తానని హెచ్చరించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు బలిపీఠమెక్కే మొదటి వ్యకి తానే అవుతానని చెప్పారు. భారతదేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తూ... దేశాన్నే సర్వ నాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
దేశంలో పట్టపగలు మహిళలకు భద్రత కరువైందన్న పవన్.. దాన్ని సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. నిరుపేదలకు వైద్యం అందించడానికి పోరాటం సాగిస్తానని చెప్పారు. జన సేన విధానం కులానికి, మతానికి అతీతంగా ఉంటుందన్నారు.

ఎన్నికల సమయానికి ఎలాగోలా అభ్యర్థులను నిలిపి, హడావిడి చేసే పార్టీలు దేశంలో చాలానే ఉన్నాయి, భవిష్యత్తులోనూ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం వాటికి భిన్నం. ఎన్నికల సమయంలో అవకాశం ఉన్నా, పోటీకి దూరంగా ఉండి, ఎన్నికల ప్రచారంలో జనాల దగ్గరకు చేరారు ఆయన. అలా ముందుకు భిన్నంగా, భవిష్యత్తుకు మార్గంగా నిలిచారు. అలా చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశారు. ఎన్నికల సమయంలో మోదీతో ఎంతో సానిహిత్యాన్ని కలిగారు. మోదీ కూడా తెలుగు ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు ఆశ్చర్యపోయారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సభ పెట్టినా, ప్రత్యేకంగా వపన్ కు ఫోన్ చేసే వారు.

ఎన్నికలు ముగిసాయి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. రాజధాని కూడా లేని ఏపి కొత్త రాజధాని నిర్మాణానికి పనులను ప్రారంభించింది. అందులో భాగంగా రైతుల నుండి భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ భూములను వదులుకోవడానికి సిద్దంగా లేరు. తాము భూమి మీద పడి బతుకుతున్నామని, భూమిని లాక్కుంటే ఏం మిగులుతుందని వారు విచారంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలని పట్టపట్టింది. అందులో భాగంగా 33వేల ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉంది. భూమి అంటే మట్టి కాదు, తమకు బ్రతుకునిచ్చే తల్లి అన్న రైతుల గోడును పట్టించుకునే వారే లేకుండా పోయారు. అయితే రైతుల గోడును వినడానికి, వారి బాధలను కలిసి పంచుకోవడానికి ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్.

రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. మోదీ, చంద్రబాబుతో తాను మాట్లాడతానని తెలిపారు. అలా రాజధాని గ్రామాల్లోనే కాదు ఎక్కడ సమస్యలు తలెత్తినా అక్కడికి వచ్చి, ప్రజా సమస్యలను తన సమస్యలుగా ఫీల్ అవడానికి సిద్దంగా ఉన్నారు పవన్. సమస్యలపై మాటలు చెప్పడం కాదు వాటికి పరిష్కారాన్ని వెతికే వరకు వదిలేది లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి ఏడాది గడిచిన సందర్భంగా మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

janasena-1

ఎక్కడైనా ఊర్ల కోసం రోడ్లు వెయ్యడం చూశాం, కానీ రోడ్ల కోసం ఊర్లను తీసివెయ్యడం చూడలేదు అంటూ ఓ నిర్వాసితుడి ఆవేదననను తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అభివృద్ది అనేది సామాన్యుడిని భాగస్వామిగా ఉండాలని కానీ భయపెట్టేదిలా ఉండకూదని ట్వీట్ చేశాడు.

janasena-3

అప్పటి హిరాకుడ్ నుండి ఇప్పటి పోలవరం వరకు అభివృద్ది పనుల వల్ల సామాన్యులు, ఆధివాసీలు నిర్వాసితులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను ప్రారంభించేపుడు ఉన్న ఉత్సాహం, పునరావాసం కల్పించడంలో ఏ ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని అన్నారు.మానవీయ కోణంతో కూడిన అభివృద్దే జనసేన ఆకాంక్ష అంటూ ఒక్క మాటలో పవన్  విజన్ ఏంటో అర్థమవుతుంది.

janasena-2

అయితే గత లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనని జనసేన పార్టీ రాబోయే హైదరాబాద్, విశాఖపట్నం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్దపడాలని నిర్ణయించిందని సమాచారం.ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జనసేన పార్టీ సమీక్షలు నిర్వహిస్తోందని సమాచారం. పార్టీ పెట్టి ఓ సంవత్సరం గడిచిన సందర్భంగా ఎన్నికల్లో నిలబడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి, భారీ మెజారిటీతో గెలిచి సత్తా చాటాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని, పవన్ పై తెలుగు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిద్దాం...

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawankalyan  janasena  pawan  first anniversary  party establish  landpooling  telugu states  capital  farmers  

Other Articles