Young lady thrashes lover on wedding day

young pregnant lady cheated by his lover, young lady pregnant after cheated by lover, young lady thrashes her lover on wedding day, young lady thrashes her cheater on wedding day, guy cheats lover after live in relation ship, guy cheats lover and disappears after pregnant, khamam praveen kumar thrashed by lover for cheating, khamam guy cheats her lover,

young lady pregnant after cheated by his lover thrashes him on wedding day, issue leads to quarrel

ఒకరితో సహజీవనం.. మరోకరితో పెళ్లి.. చివరుకు చిత్తడి..

Posted: 03/14/2015 07:43 PM IST
Young lady thrashes lover on wedding day

ఒకరితో ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సహజీవనం చేసి గర్బవతిని చేసిన తరువాత.. మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్న ప్రభుద్దుడికి తగిన శాస్తి జరిగింది. పెళ్లి మండపంలోనే ఆ మాయదారి మోసకారి ప్రేమికుడికి దేహశుద్ది చేసింది. దీంతో మోసగాడి ఒళ్లు అతడి బందువుల ఒళ్లు చిత్తడైపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన ప్రవీణ్ కుమార్.. హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సమయంలో ఖమ్మానికి చెందిన ఓ యువతితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి, సహజీవనానికి దారి తీసింది. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. కానీ ఆమెతో పెళ్లికి ప్రవీణ్ కుమార్ సాకులు చెపుతూ కాలయాపన చేయటంతో బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  అతనిపై కేసు నమోదైంది.

దాంతో అతడు వివాహానికి కొంత సమయం కావాలని కోరి మాయమాటలు చెప్పాడు. అనంతరం హైదరాబాద్ నుంచి మణుగూరుకు మకాం మార్చాడు. ఈ లోపు తన తల్లిదండ్రులు కుదర్చిన వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు.  విషయం తెలుసుకున్న బాధితురాలు, తన తరపు బంధువులను వెంట బెట్టుకుని సరిగ్గా పెళ్లి మండపానికి వచ్చి చేరింది. అక్కడ వరుడి తనను మోసగించిన ప్రవీణ్ కుమార్ అని గుర్తు పట్టగానే వెళ్లి దేహశుద్ది చేసింది. అందుకు అమె బందువులు కూడా సహకరించడంతో వరుడ వీపు విమానం మోత మోగింది. దీంతో వరుడి తరపు బందువులు రంగంలోకి దిగి బాధితురాలి తరపు బందువులను అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రంగంలోకి దిగిన పోలీసులు వరుడి, బాధితురాలిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అసలేం జరిగిందో తెలియక  పెళ్లి కూతరు తరుపువాళ్లు.. తెల్లముఖం వేశారు. తీరా విషయం తెలిసాక తమ అమ్మాయికి అన్యాయం జరగలేదని సరిపెట్టుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : praveen kumar  khammam  Live in realation ship  thrashed  

Other Articles