Suicide bombers killed 15 at two churches in lahore of pakistan

Pakistan, Suicide attacks, Christian, Youhannabad.

In another gruesome attack on minorities in Pakistan, terrorists targeted the Christian community in Lahore, killing at least 15 people in suicide hits on two different churches within a radius of 500 metres in Youhannabad. The incident, which also left 78 people injured, sparked violent protests, resulting in lynching of two suspected militants and damage to infrastructure. For the first time the Christian community reacted violently to an act of brutality.

పాకిస్థాన్ చర్చిలపై ఉగ్రదాడులు.. 15 మంది మృతి

Posted: 03/16/2015 08:59 AM IST
Suicide bombers killed 15 at two churches in lahore of pakistan

పాకిస్థాన్‌లోని యోహానాబాద్‌లో రెండు చర్చిల వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు జరిపారు. రోమన్ క్యాథలిక్ చర్చి, క్రైస్ట్ చర్చిలలో జరిపిన ఈ దాడుల్లో 15మంది మృతి చెందగా 80 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులు తామే జరిపినట్లు తాలిబన్ పాకిస్థాన్ చీలిక సంస్థ అయిన జమాత్-ఉల్-అహ్రార్ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన శాస్త్రవేత్త సిద్దిఖ్‌ను సుదీర్ఘకాలగా అమెరికా జైలులో నిర్బంధించినందుకు నిరసనగా ఈ దాడులు జరిపినట్లు జమాత్-ఉల్-అహ్రార్ అధికార ప్రతినిధి ఎహ్‌సానుల్లా ఎహ్‌సాన్ ప్రకటించారు. పార్థనల సమయంలో చర్చిల లోపలికి వెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అక్కడి పోలీసు సిబ్బంది వారిని అడ్డుకోవడంతో వారు గేటు వద్దే తమనుతాము పేల్చేసుకున్నారు.

ఈ దాడితో పాకిస్థాన్‌లోని క్రైస్తవులంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, భద్రత కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని సహోత్రా అన్నారు. తాహిర్ బస్సీ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, క్యాథలిక్ చర్చిలో నేను ప్రార్థన చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మరోవైపు ఆత్మాహుతి దాడితో తీవ్ర ఆగ్రహానికి లోనైన క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. మానవ బాంబులకు సహకరించినట్లుగా అనుమానించిన ఇద్దరు వ్యక్తుల్ని చితకబాది, దహనం చేశారు. 2013లోనూ ఉగ్రవాదులు యోహానాబాద్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడి 127మందిని పొట్టన పెట్టుకున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Suicide attacks  Christian  Youhannabad.  

Other Articles