Legendery poet ralla bandi kavithaprasad died

rallabandi kavithaprasad, telugu poet, kcr, juluri, c.narayanreddy

legendery poet ralla bandi kavithaprasad died. famous telugu poet ralabandi kavithaprasad leaved his final breath at hyderabad. he is suffering from several health problems for last month.

రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నుమూత.. పలువురి సంతాపం

Posted: 03/16/2015 09:01 AM IST
Legendery poet ralla bandi kavithaprasad died

ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ దళిత అభివృద్ధి సంస్థ సంయుక్త కార్యదర్శి రాళ్లబండి కవితా ప్రసాద్‌ మరణించారు. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గత నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచీ వెంటిలేటర్‌పై ఉంచి గుండె సంబంధ సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. నిరంతరం డయాలసిస్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కిడ్నీ కూడా ఫెయిల్‌ అయినట్టు గుర్తించారు. అంతకంతకూ విషమిస్తున్న కవితాప్రసాద్‌ ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేసిన చివరి ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. ఆయన మరణాన్ని వైద్య వర్గాలు ధ్రువీకరించాయి.

ఆయన మరణ వార్తతో తెలుగు సాహితీ జగత్తు దిగ్ర్భాంతికి గురయింది. తెలుగుదనం ఉట్టిపడే నిండైన ఆహార్యంతో మెరిసే ఆ నిండైన సాహితీ మూర్తికి నివాళి అర్పించింది. కవితాప్రసాద్‌ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. సాహితీ వేత్తల్లో ఆయన స్థానం సుస్థిరమైనదని కొనియాడారు. కవితా ప్రసాద్‌ అవధానానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఉత్తమ సాహితీవేత్త అని జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అన్నారు. అష్టవధానానికి కవితా ప్రసాద్‌ అధినాయకుడని ప్రముఖ తెలంగాణ కవి జూలూరి గౌరీ శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేదని తె.రా.వే అధ్యక్షుడు జయధీర్‌ తిరుమలరావు అన్నారు. సాహిత్య ప్రక్రియలు పుంజుకునేందుకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి నివాళి అర్పించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rallabandi kavithaprasad  telugu poet  kcr  juluri  c.narayanreddy  

Other Articles