Sirpur paper mill ready to shutter down in telanagna

telangana, sirpur, paper mill, kagajnagar, karimnagar, industry

sirpur paper mill ready to shutter down in telanagna. telanaganas historical industry sirpur paper mill ready to close. the mill employees union president, present home minister naayini narasimhareddy did take any action to stop the closing.

సిర్ 'పూర్' కాగితపు మిల్ మూసివేత..?

Posted: 03/17/2015 09:14 AM IST
Sirpur paper mill ready to shutter down in telanagna

తెలంగాణ పరిహ్రమల్లో చీకటి కోణం వెలుగులోకి వస్తోంది. ఎంతో కీర్తి ప్రతిష్టలున్న సిర్పూర్ కాగితపు మిల్ మూతపడితే తెలంగాణ చరిత్ర పుటల్లోంచి ఓ పేజీ చిరిగిపోతుంది.. సిర్పూర్ కాగితపు మిల్లు యాజమాన్యం నాలుగు నెలల కిందటే లాకౌట్‌ ప్రకటించింది. బీఐఎఫ్‌ఆర్‌కు దరఖాస్తు చేసింది. అక్కడ అనుమతి లభిస్తే, 3600 మంది కార్మికులు రోడ్డునపడతారు. దాంతో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల్లో అందోళన మొదలైంది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు గుండెపోటుతో మరణించగా.. ఒక కార్మికుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అయినా, సిర్పూర్‌ పేపర్‌ మిల్లు గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు అయిన కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పట్టించుకోవడం లేదు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు.

 1938లో నిజాం పాలకులు సిర్పూర్‌లో  పేపర్‌ మిల్లును స్థాపించారు. నాలుగేళ్ల తర్వాత 1942లో ఇది ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పట్లోనే ఈ మిల్లు 5100 టన్నుల కాగితం ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. 2002లో రికార్డు స్థాయిలో 83,550 టన్నుల కాగితపు ఉత్పత్తిని సాధించింది. ఉత్పిత్తితోపాటు కార్మికులూ పెరిగారు. మిల్లు మూతపడే నాటికి ఇందులో వివిధ విభాగాల్లో దాదాపు 3,650 మంది కార్మికులు పని చేస్తున్నారు. 2009 నాటికే ఈ పరిశ్రమ ఏటా 30 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు గుర్తింపు కార్మిక సంఘానికి ప్రస్తుత అధ్యక్షుడు రాష్ట్ర హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి మిల్లు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానని, యాజమాన్యాన్ని ఒప్పిస్తానని నాయిని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. కానీ హామీలు నీటిలో మూటల్లా మారియే తప్ప అమలుకు నోచు కోలేదు. దాంతో సిర్పూర్ మిల్లు పరిస్థితి అద్వానంగానూ, కార్మికుల భవిష్యత్తు అయోమయంలోనూ పడింది. మరి దీనిపై తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  sirpur  paper mill  kagajnagar  karimnagar  industry  

Other Articles