ఎన్నికల్లో పార్టీకి, రాజకీయ నాయకులకు సహాయం చేస్తు, వారు అధికారంలోకి వస్తే లాభం పొందే వారు ఎంతో మంది ఉంటారు. పార్టీకి ఎంతో పాటుపడ్డాడని అధికార పార్టీ నేతలు కూడా అలా సహాయం చేసిన వారికి కొంత అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి ఘటనే తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. ఇటీవల నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు వైన్ షాపులపై దాడులు నిర్వహించారు. సుంకం చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యుడైన వైన్ షాప్ యజమానిపై కేసు నమోదు చేశారు. అతని మద్యం దుకాణాన్ని మూసివేయించారు. వైన్ షాప్ యజమానిని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అసెంబ్లీకి తీసుకొచ్చారు.
'ఈయన మా దగ్గరే మద్యం దుకాణం నడుపుతున్నాడు. ఆయనపై కేసు పెట్టి, దుకాణం మూసివేయించారు. కానీ, ఇతను మన పార్టీకి బాగా కావాల్సిన వాడు. ఎన్నికల సమయంలో ఎంతో సాయపడ్డాడు. వెంటనే కేసు ఎత్తివేయించి, షాపు తిరిగి తెరిపించే ఏర్పాటు చేయాలి' అని గొంగడి సునీతారెడ్డి కోరారు. అయితే తెలంగాణ ఎక్పైజ్ మంత్రి పద్మారావ్ ఆ మద్యం వ్యాపారిపై ఘాటుగా స్పందించారు. సుంకం చెల్లించకుండా మద్యం అమ్ముతున్నందుకు నీ పై కేసు పెట్టారు. మరీ ఎక్కువ తక్కువ చేస్తే పీడీ యాక్ట్ పెట్టిస్తా అని తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి ఘటనల గురించి మనం తరుచూ వింటూనే ఉంటాం, అయితే మంత్రి గారి స్పందన మాత్రం ఎవరూ ఊహించరు. మొత్తానికి మద్యం వ్యాపారి పప్పులుడకలేదనే చెప్పాలి. అంత లాబీయింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది పాపం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more