Rajendra prasad and jayasudha to contest in maa elections

rajendra prasad and jayasudha to contest in maa elections, actress Jayapradha as opponent, Movie Artists Association elections, MAA elections on 29th March, pawan kalyan, chiranjeevi, nagababu, ram charan teja, tollywood, murali mohan, rajendra prasad, movie artists association, maa president elections, rajendra prasad, jayasudha

Nata Kireeti Rajendra Prasad announced that he will contest for the President post of Movie Artists Association (MAA) elections this year. He is going to face actress Jayapradha as opponent in elections. Movie Artists Association elections will be conducted on 29th March

రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..రాజేంద్రుడు వర్సెస్ సహజనటి

Posted: 03/19/2015 09:57 PM IST
Rajendra prasad and jayasudha to contest in maa elections

సినీ కళాకారుల సంఘం (మా) అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. ఈ పదవికి తాను దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. దాంతో ఆ పదవిని చేపట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించారు.

అయితే.. ఈలోపు ఈ పదవికి తాను రంగంలో ఉంటానంటూ సహజనటి జయసుధ ముందుకొచ్చారు. ఆమెకు 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతు పలికారు. ఆయన మద్దతుతో జయసుధ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక దశలో మంచు విష్ణు కూడా ఈ పదవికి పోటీ పడతారన్న కథనాలు వచ్చాయి గానీ.. ఆయన వాటిని ఖండించారు. తాను పోటీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవి బరిలో రాజేంద్రప్రసాద్, జయసుధ నిలవడం దాదాపు ఖాయమైంది. కాగా మా ఎన్నికలకు ఈ నెల 21 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం వుండగా, ఎన్నికలు మాత్రం ఈ నెల 29న మా కార్యాలయంలో నిర్వహించనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : movie artists association  maa president elections  rajendra prasad  jayasudha  

Other Articles