Rahulgandhi | Congress | Elections

Congress committe decided to conduct elections in the party

rahul gandhi, congress, rahul, aicc, elections, party, vice president

congress committe decided to conduct elections in the party. the congress party vice president rahul gandhi proposed to elections in the party. recently party decided to elections for the rahul proposal.

ఆహా.. రాహుల్ అలక మానడం కోసమేనా..?

Posted: 03/27/2015 09:05 AM IST
Congress committe decided to conduct elections in the party

మామూలుగా చిన్న పిల్లలు మారాం చేస్తే ఏ చాక్లెట్టో బిస్కోట్టో ఇచ్చి వారిని సముదాయిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్ మార్గదర్శి అనుకుంటున్న రాహుల్ గాంధీపై తల్లి సోనియా గాంధీ ఇలానే వ్యవహరిస్తోంది. గత కొంత కాలంగాపార్టీకే కాదు అన్నింటికి దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ పార్టీలో అత్యున్నత అధ్యక్ష పదవి నుంచి కింది స్థాయిదాకా అన్ని పదవులకూ ఎన్నికలు జరపాలంటూ పట్టుబట్టారు. మొత్తానికి రాహుల్ బాబు డిమాండ్‌ను అంగీకరిస్తు అధిష్ఠానవర్గం ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. దీంతో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మే 15నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఎన్నికల షెడ్యూలు వెలువడింది. సీనియర్‌ నేత ముళ్లపళ్లి రామచంద్రన్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఎన్నికల అథారిటీ ఈ షెడ్యూలును రూపొందించింది. సెప్టెంబర్‌ 21 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే ఎన్నికల కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, పీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక జరుగనున్నది. సెప్టెంబర్‌ 30న అవసరమైతే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఓటింగ్‌ జరుగుతుంది. తర్వాత నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరిగే ఏఐసీసీ ప్లీనరీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతుంది.

ఇలా రాహుల్ గాంధీని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. ముందు నుండి యువత మంత్రాన్ని జపించి, సీనియర్లను చులకనగా చూసిన రాహుల్ బాబు సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే రాహుల్ బాబు పర్యటించిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుపు సంగతి అటుంచీ, ఓటింగ్ శాతం కూడా తగ్గడంతో అన్ని పార్టీలు దాన్ని విమర్శగా వాడుకున్నాయి. అయితే తరువాత రాహుల్ బాబు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోవడం జరిగింది. అయితే పార్టీలో తనకు పట్టుండాలని ముందు నుండి రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ కు అవకాశం కల్పించడం లేదని ఓ వార్త ఉంది. అయితే తాజాగా ఆ వార్తకు బలం చేకూరేలా రాహుల్ అభీష్టాలను కాంగ్రెస్ నాయకత్వం నెరవేరుస్తోంది. మరి కనీసం రాహుల్ గాంధీ ఇప్పుడైనా అలక మాని.. తిరిగి వస్తారో లేదో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  congress  rahul  aicc  elections  party  vice president  

Other Articles