కోరికలు తీరాలని మనలో చాలా మంది చాలా రకాలుగా మొక్కులు మొక్కుకుంటాం. కోరికలు ఫలించాలని కొబ్బరికాయలు కొట్టడం మామూలే. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి కొంత భిన్నంగా ఏదో ఒకటి చేస్తారు. అయితే మూఢనమ్మకాలు మరీ ఎక్కువైతే మాత్రం విపరీతాలు తావిచ్చినట్లవుతుంది. తాజాగా ఓ భక్తశిఖామణి పిల్లలు కలగాలని ఏకంగా తన నాలుకనే అమ్మవారికి సమర్పించాడు. అయినా నాలుక కోసుకుంటేనే పిల్లలు కలుగుతారని అతనికీ తెలుసు. మరి తెలిసినా అమ్మవారి భక్తిలో మునిగో.. లేక పిల్లలు కావాలని కోరిక బలంగా ఉండో నాలుకనే కోసుకున్నాడు. అప్పుడెప్పుడో భక్త కన్నప్ప శివుడికి తన కళ్లు ఇచ్చినట్లు ఓ తమిళ భక్తుడు ఏకంగా తన నాలుకను అమ్మవారికి సమర్పించాడు.
నాలుక కోసి అమ్మవారికి సమర్పిస్తే సంతానం కలుగుతుందంటూ పూజారి చెప్పిన మాట నమ్మిన ఓ యువకుడు ఆ మేరకు తెగించి, తన మూఢ భక్తిని చాటుకున్నాడు. తమిళనాడు వేలూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని పొన్నేరిలో వేడియమ్మన్ ఆలయం వుంది. ఈ ఆలయానికి మిట్టకుప్పం గ్రామానికి చెందిన సుధాకర్వచ్చాడు. గుడిచుట్టూ 8 సార్లు ప్రదక్షిణ చేసిన సుధాకర్ తన జేబులోఉన్న చిన్న చాకును తీసి నాలుకను కోసేసుకున్నాడు. తర్వాత ఆ నాలుక ముక్కను అమ్మవారి విగ్రహం ముందుంచి అక్కడే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం గాని భక్తులు అతని ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపారు. విషయమేంటని అడిగితే ఓ చీటిని తీసి వారికి చూపించాడు. తనకు వివాహమై మూడేళ్లయినా ఇంత వరకూ సంతాన భాగ్యం కలుగలేదని, అయితే ఆ ఆలయ పూజారి మునియాండి నాలుక కోసి అమ్మవారికి సమర్పిస్తే తక్షణం సంతానం కలుగుతుందని చెప్పడంతో తాను ఆ మేరకు మొక్కు తీర్చుకున్నానని ఆ చీటిలో వుంది. అది చదివిని భక్తులు సుధాకర్‌ను వెంటనే వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ నాలుకను మాత్రం అమ్మవారి విగ్రహం ముందు అలాగే వదిలేయడంతో చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. మొత్తానికి మన వద్ద ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మేవారు ఇంకా ఉన్నారని తెలుస్తోంది. మరి అమ్మవారు ఆ అపర భక్తుడిని కరుణిస్తుందో లేదో పాపం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more