girl child molested in krishna district, sexual harassment

Girl child molested in krishna district

girl child molested in krishna district, sexual harrasment on girl child, sexual abuse on girl child, girl child molest in Andhra Pradesh, girl child molested, krishna district, violence against women, crime on women, minor girl molested in AP, crime in Andhra pradesh, nine year old molested

girl child molested by 50 years old in krishna district, and warns victims parents to death if approach police station

చిన్నారిపై లైంగిక వేధింపులు.. తల్లిదండ్రులకు వార్నింగులు..

Posted: 03/27/2015 09:52 AM IST
Girl child molested in krishna district

కృష్ణా జిల్లాలొ దారుణం జరిగింది. అభం శుభం ఎరుగని తొమ్మిదేళ్ల బాలికపై తాత వయస్సున్న కామాంధుడు పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన కామాంధుడిని రక్షించే పనిలో కుల పెద్దలు పంచాయితీని ఏర్పాటు చేశారు. మచ్చకైనా మానవత్తం లేని కర్కోటకుడు.. పైగా బాధితురాలి తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

నూజివీడు సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తునన 9 ఏళ్ల బాలికపై.. తన తాత వయస్సున్న, వరసకు తాతైన యాభై ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇలా గత కొన్ని రోజులుగా బాలికపై లైంగికంగా వేదింపులకు పాల్పడుతున్నా.. బాలిక తాత అటపట్టిస్తున్నాడంటూ ఊరుకుంది. అయితే ఓ రోజు శృతిమించి ఆటపట్టించడంతో.. బాలిక జరిగిన వృత్తాంతమంతా తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ముందస్తు జాగ్రత్త పడిన నిందితుడు.. గమ గ్రామ కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి తప్పు బాలికదే అన్నట్లు రుజువు చేయసాగాడు.

అంతటితో ఆగకుండా,. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ, ఒక వేళ చేస్తే.. ప్రాణాలు తీస్తానని, గ్రామ బహిష్కరణ చేస్తామని బాధితురాలి తల్లిదండ్రులను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో. కేసు పెట్టవద్దంటూ పెద్దమనుషులు బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. కాగా చిన్నారి అని కూడా చూడకుండా లైంగిక వేదింపులకు పాల్పడ్డ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl child molested  krishna district  violence on women  crime on women  

Other Articles