Rtcbus | Theft | Nirmal

Lorry driver become a thief and tried to theft rtc bus

rtc bus, thief, lorry, nirmal, rtc, depo, police

lorry driver become a thief and tried to theft rtc bus. in telangana adilabad dist. a lorry driver tried to theft rtc bus from nirmal rtc depo. police caught him at the maharastra boarder.

ఆర్టీసీ బస్సు దొంగిలిస్తే.. ఆ కిక్కే వేరప్పా...!

Posted: 03/27/2015 11:54 AM IST
Lorry driver become a thief and tried to theft rtc bus

దొంగ తనం చెయ్యాలనుకున్న వాళ్లు ఏ గోల్డ్ చైన్ నో లేక ఇంకేదో విలువైన వస్తును గుట్టుచప్పుడు కాకుండా దొంగిలిస్తారు. ఇది మామూలుగా జరిగే తంతు కానీ ఓ దొంగ కాస్త రొటీన్ కు భిన్నంగా ఆలోచించాడు. చిన్న చిన్న వాటిని దొంగిలిస్తే కిక్ లేదనుకున్నాడో డబ్బులు తక్కువ వస్తాయని అనుకున్నాడో కానీ ఏకంగా బస్సునే దొంగిలించాలని ప్రయత్నించాడు. అయితే ఆర్టీసీ బస్సును అదీ ఆర్టీసీ డిపో నుండి దొంగిలిస్తే ఎలా ఉంటుంది. కానీ ఓ దొంగ ఏకంగా డిపో నుండే బస్సును కొట్టేసి, బస్సుతో సహా రాష్ట్రం దాటి ఉడాయించాలనుకున్నాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది.. చివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే..

ఆదిలాబాద్ జిల్లాలోని తాళమడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శర్మకి శ్రీకాంత్(30) శుక్రవారం ఉదయం నిర్మల్ డిపో నుంచి ఓ ఖాళీ బస్సును తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నేరడిగొండ మండలం రోడ్డుమాముల టోల్ ప్లాజా వద్ద బస్సుతోపాటు శ్రీకాంత్‌ను పట్టుకున్నారు. ఇక్కడి నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే మహారాష్ట్ర సరిహద్దు వస్తుంది. బస్సును మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయించాలని శ్రీకాంత్ ప్రయత్నంగా తెలుస్తోంది.  మొత్తానికి ఆర్టీసీ బస్ ను బస్ డిపో నుండి దొంగిలించి.. పారిపోవడం వార్తల్లో నిలిచారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rtc bus  thief  lorry  nirmal  rtc  depo  police  

Other Articles