గోవా.. అ పేరు చెప్పగానే. యువత దెగ్గర్నించి.. మధ్య వయస్కుల వరకు అందరికి అదోక అహ్లాదకర ప్రదేశం. మరోలా చెప్పాలంటే భారత దేశంలో విదేశీ సంస్కృతితో కొలువైన రాష్ట్రం. విందు, వినోదం తారాస్థాయికి చేరే ప్రాంతం. అంతేకాదండి అనునిత్యం పచ్చతోరణంలా.. నిత్యం విదేశీ పర్యటకులతో తాకిడితో కళకళలాడే గోవాలో. వారి సందడికి మనవారు జతకడితే.. ఆ వాతావరణం భలే షుషారు తెప్పిస్తుంది. సముద్ర తీరాల వెంట.. హోరుగా వీచే పవనాలతో కదులుతున్న అలల పరవళ్లు.. వాటిని చీల్చుకుంటూ కేరింతల మధ్య సాగే పర్యాటకులు ఈతలు, స్నానాలు, మోటార్ బోట్ బైకుల విన్యాసాలు అన్ని ఇన్నీ కావు. చూసిన వాళ్లకు చూసినంత.. కన్నుల పండుగ. బహిరంగ చుంభనాలు.. ఎక్కడ పడితే అక్కడ టాటూలు, మద్యం లాగించడాలు, కార్లు, జీపులలో పెద్దగా సౌండ్ పెట్టుకుని పార్టీలు. అంతేకాదు బికినీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా వున్నాయి.
అలాంటి గోవా రాష్ట్ర రాజధాని పానాజీకి అత్యంత చేరువైన గ్రామంలో మాత్రం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాశ్చాత సంస్కృతి నీలినీడలు పడి.. తమ గ్రామాంలోని ప్రజలు చెడు పద్దతులకు అలవాటు పడే ప్రమాదముందని సల్వాదర్ డో ముండో గ్రామ పంచాయితీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విపరీత ధోరణులను నియంత్రించాల్సిన అవసరం ఉందని, అందుచేతే తామ గ్రామ పంచాయతి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని గ్రామ ఉపసర్పంచ్ రీనా ఫెర్నాండెస్ చెప్పారు. తమ గ్రామంలో ఇక నుంచి బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై నిషేధం విధించామని చెప్పారు.
గోవాకు వస్తున్న పర్యాటకుల్లో కొన్ని జంటలు మందు తాగుతూ పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ విస్తుగోలిపే చర్యలకు కూడా పాల్పడుతున్నారని, దీనిపై తమ గ్రామ ప్రజల నుంచి పెద్ద ఎత్తున పిర్యాదులు అందాయని, దీంతో తాము ఈ మేరకు పంచాయితీలో తీర్మాణం చేశామని చెప్పారు. దేశీయ పర్యటకులతో పాటు విదేశీ పర్యాటకుల ఈ మేరకు సూచిస్తూ.. తమ గ్రామ పరిధిలో బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తమ గ్రామ ప్రజల శ్రేయస్సు కోరి తీసుకున్న నిర్ణయానికి పర్యాటకులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గోవా సంస్కృతిక శాఖ జారీ చేసిన డ్రెస్ కోడ్ నిబంధనలు ఒక వైపు చర్చనీయాంశంగా మారగా, మరోవైపు సల్వాదర్ డో ముండో గ్రామ పంచాయతీ తీర్మాణం కూడా తోడవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more