Powercharges | Hike | Telangana

Telangana hikes power charges for industry non domestic sectors

Powercharges, Hike, Telangana, industry, non-domestic sectors, domestic

Telangana hikes power charges for industry, non-domestic sectors: Electricity charges for industries, commercial and other non-domestic categories of consumers have been increased by 30-40 paise in Telangana state along with a marginal increase in tariff on higher domestic slabs, effective from April 1, 2015.

కరెంట్ షాక్.. కానీ కండీషన్స్ అప్లై

Posted: 03/28/2015 09:06 AM IST
Telangana hikes power charges for industry non domestic sectors

ఏదో స్కీమ్ లకు అయితే కండీషన్స్ అప్లై అని విన్నాం కానీ కరెంట్ షాక్ కు కూడా కండీషన్స్ ప్రకారం కొడుతుందా అనుకోకండి. కరెంట్ షాక్ కేవలం కొన్ని ప్రత్యేకతలతో మాత్రమే తగులుతోంది అందుకే అలా అన్నాం. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో విద్యుత్తు చార్జీలు కొంచెం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే  మామూలు, మధ్యతరగతి వారికి ఊరటనిస్తూ కమర్షియల్, ఇండస్ట్రీస్ లపై మాత్రం కాస్త భారం వేశారు.  ఎక్కువ విద్యుత్తు వినియోగించే వాళ్లకు ఎక్కువ బాదుడు అనే సూత్రాన్ని చార్జీల పెంపులో అమలు చేశారు. కాకపోతే, నెలకు 200 యూనిట్లలోపు వాడుకునే వాళ్లకు ఎటువంటి పెంపు లేదు. ఆపైన వాడుకునే వాళ్లకు మాత్రం స్వల్ప షాకిచ్చింది తెలంగాణ సర్కార్. 400 యూనిట్లపైబడిన వినియోగదారులందరినీ ఒకే టారి‌ఫలోకి తీసుకొచ్చింది. మొత్తానికి విద్యుత్తు చార్జీల పెంపు ద్వారా తెలంగాణ ప్రభుత్వం వినియోగదారులపై.816 కోట్ల భారం మోపింది. ఈ మేరకు 2015-16 సంవత్సరంలో విద్యుత్తు చార్జీల పెంపునకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది.

మామూలుగా ఇళ్లకు వినియోగించే విద్యుత్తు పై 200 యూనిట్ల వరకూ పాత చార్జీలే వర్తిస్తాయి. ఈ కేటగిరీలో రాష్ట్రంలో మొత్తం 88 లక్షలమంది ఉంటే 80 లక్షల మందిపై ఎటువంటి చార్జీల భారం మోపలేదు. దాదాపు 18 లక్షల మంది వినియోగదారులుండే వ్యవసాయం, కుటీర పరిశ్రమలకూ చార్జీలు పెంచలేదు ఇప్పటి వరకు 401-500 యూనిట్లు ఉపయోగిస్తే 7.75 రూ. వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 400 యూనిట్లపైన ఎంతయినా 8.50 రూ. చెల్లించాల్సిందే. గృహ విద్యుత్తుతోపాటు పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వీధి దీపాలు, పీడబ్ల్యూడీ పథకాల నిర్వహణ కూడా కొత్త టారిఫ్ తో పెరగనుంది. మొత్తానికి తెలంగాణ విద్యుత్ ఛార్జీలను పెంచినా, ఎక్కువగా విద్యుత్ ను వినియోగించే వారికి మాత్రమే భారాన్ని మోపింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Powercharges  Hike  Telangana  industry  non-domestic sectors  domestic  

Other Articles